ఉప్పల్ వేదికగా ఇండియా- ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఈరోజు మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తన రెండో ఇన్నింగ్స్ లో 6 వికెట్లు కోల్పోయి 316 పరుగులు చేసింది. దీంతో ఇంగ్లీష్ జట్టు 126 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.
Read Also: Minister Shridhar Babu: సామాజిక పారిశ్రామికవేత్తలకు రాజధానిగా తెలంగాణను తీర్చిదిద్దుతాం..
ఇంగ్లండ్ ఇన్నింగ్స్ లో ఓలీ పోప్ సెంచరీ చేసి జట్టుకు కీలకమైన పరుగులు సాధించి పెట్టాడు. పోప్ 208 బంతుల్లో 17 ఫోర్లతో 148 పరుగులు చేశాడు. కాగా.. క్రీజులో రెహాన్ అహ్మద్ 16 పరుగులతో ఉన్నాడు. అంతకుముందు.. బెన్ ఫోక్స్ తో కలిసి మంచి భాగస్వామ్యం చేయగలిగారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ లో ఓపెనర్లు జాక్ క్రాలే 31, బెన్ డకెట్ 47, జో రూట్ 2, జానీ బెయిర్ స్టో 10, కెప్టెన్ బెన్ స్టోక్స్ 6 పరుగులు చేశారు. భారత బౌలర్లలో బుమ్రా, అశ్విన్ తలో రెండు వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా వీరిద్దరూ తలో వికెట్ పడగొట్టారు. కాగా.. ఈ టెస్టులో మొదట టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్ లో 246 పరుగులు చేసిన ఇంగ్లాండ్.. టీమిండియా 436 పరుగులకు ఆలౌటైంది.
Read Also: Viral News: “2024లో ప్రపంచం ఇలా ఉంటుంది”.. వైరల్ అవుతున్న 1994 నాటి న్యూస్ పేపర్ ప్రిడిక్షన్..