Viral News: సాధారణంగా ప్రతీ ఏడాది మనం వచ్చే ఏడాది మనం ఎలా ఉంటాము..? ప్రపంచం ఏ విధంగా మారుతుంది..? ఏ కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వస్తుంది..? అని అంచనా వేస్తుంటాం. మరో వందేళ్లకు భూమి ఇలా ఉంటుంది, అలా ఉంటుందని ప్రిడిక్షన్స్ చెప్పడం చూస్తుంటాం. అయితే, 1924 నాటి ఓ న్యూస్ పేపర్ అంచనాలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. వందేళ్లు అంటే 2024లో ప్రపంచ పరిస్థితులను గురించి ఆ న్యూస్ పేపర్ ఓ కథనం ప్రచురించింది. తాజాగా వైరల్ అవుతున్న ఈ న్యూస్ పేపర్ క్లిపింగ్స్‌పై నెటిజన్లు తమకు నచ్చిన విధంగా కామెంట్స్ చేస్తున్నారు.
Read Also: Bihar Crisis: నితీష్‌కు కూటమి నేతల ఫోన్లు.. అటువైపు నుంచి ఆన్సర్ ఇదే..!
కెడాలోని కాల్గరీ యూనివర్సిటీ రీసెర్చ్ అసోసియేట్ న్యూస్ పేపర్‌లో ప్రచురితమైన ప్రిడిక్షన్స్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. అందులో కొన్ని నిజమైనప్పటికీ.. మరికొన్ని సత్యదూరంగా ఉన్నాయి.
2024లో గుర్రాలు అంతరించిపోతాయి, 2024లో ఆటోమొబైల్స్ రంగం చాలా అభివృద్ధి చెందుతుంది. సినిమాలు ప్రపంచ శాంతిని తెస్తాయని అంచనా వేసింది. సినిమాలే ప్రపంచ భాషగా మారతాయని, ఇవి ప్రపంచ వ్యాప్తంగా సంఘర్షణల్ని దూరం చేసేందుకు సాయపడుతాయని పేర్కొంది. సినిమాలు చూసేందుకు ప్రజలు ఎక్కువగా ఇంట్లోనే గడుపుతారని చెప్పింది. పిల్లల బెడ్స్ ఆటోమెటిక్‌గా పనిచేసి వారిని బయటకు పంపుతాయని, రైళ్లు రెండు-మూడు రెట్లు వేగంగా ప్రయాణిస్తాయని, ప్రజలు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రయాణించే సమయంలో సినిమాలు చూస్తారని, మనుషులు ఒక గ్రహం నుంచి మరో గ్రహానికి వెళ్తారని అంచానా వేసింది.
Beds will automatically fling children out in the morning pic.twitter.com/OJx8Nj3Hy0
— Paul Fairie (@paulisci) January 1, 2024