ఈ నగరానికి ఏమైంది సినిమాకి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ మూవీ సీక్వెల్ కోసం వెయిట్ చేసే వాళ్ల లిస్ట్ చాలా పెద్దదే. ఇలాంటి ఒక న్యూ జనరేషన్ క్లాసిక్ ఇచ్చిన తరుణ్ భాస్కర్, మూడున్నర ఏళ్ల విరామం తర్వాత మరోసారి మెగాఫోన్ పట్టాడు. వీజీ సైన్మా క్విక్ ఫాక్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ‘కీడా కోలా’ అనే పాన్ ఇండియా సినిమాని తరుణ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇటివలే అనౌన్స్ అయిన ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. తెలుగుతో పాటు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ కానున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ నవంబర్ 18న శుక్రవారం మొదలైంది. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాని 2023 లో ఐదు భాషల్లో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయబోతున్నారు. షూట్ బిగిన్స్ అంటూ రిలీజ్ చేసిన పోస్టర్ లో, బాటిల్ డక్కన్.. రక్తం చిమ్ముతున్న బొద్దంకని టైటిల్ లో చూపించిన విధానం చూస్తుంటే కీడా కోలా సినిమాతో తరుణ్ భాస్కర్ ఎదో కాంట్రవర్సీని టచ్ చేసి కామెడీ పండించబోతున్నట్లు ఉన్నాడు.
Also Read : Special Story on Marriages: రోజులు 31. పెళ్లిళ్లు 32 లక్షలు. ఖర్చు 3.75 లక్షల కోట్లు
విజయ్ దేవరకొండతో పెళ్లి చూపులు సినిమా చేసి నేషనల్ అవార్డ్ అందుకున్న తరుణ్ భాస్కర్, ఆ తర్వాత ఒక సినిమాలో హీరోగా చేసి… ఇప్పుడు క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నాడు. ఫలక్ నామా దాస్ సినిమాలో, “ఏం చిల్లరగాల్లు రా మీరు” అని తరుణ్ భాస్కర్ చెప్పిన డైలాగ్ ఇప్పటికీ యూత్ వాడుతూనే ఉన్నారు. నా సావ్ నేన్ సస్తా, టైం అంటే కౌశిక్ కౌశిక్ అంటే టైం, నేన్ యాక్టర్ అవుతా, తాగుదాం, అది బాహుబలి రేంజ్ గ్రాఫిక్స్ అన్నా… లాంటి డైలాగ్స్ ని యూత్ ని గిఫ్ట్ గా ఇచ్చిన తరుణ్ భాస్కర్ కీడా కోలాతో ఈసారి ఎలాంటి ట్రెండ్ ని క్రియేట్ చేస్తాడు? ఎలాంటి క్యాచీ డైలాగ్స్ ని యూత్ కి ఇస్తాడు అనేది చూడాలి.