‘దేవర’ సినిమా తర్వాత సాలిడ్ లైనప్ సెట్ చేసుకుంటున్నాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ‘ఎన్టీఆర్’. వార్ 2, దేవర 2, నెల్సన్ దిలీప్ కుమార్, త్రివిక్రమ్ శ్రీనివాస్.. ప్రస్తుతానికి ఎన్టీఆర్ లైన్‌లో ఉన్న సినిమాలు ఇవి. ఇప్పటకే బాలీవుడ్ డెబ్యూ మూవీ ‘వార్ 2’ షూటింగ్ పూర్తి చేశాడు. రీసెంట్‌గా డబ్బింగ్ కూడా కంప్లీట్ చేసేశాడు. ‘హృతిక్ రోషన్’తో కలిసి నటించిన ఈ సినిమా ఆగష్టు 14న రిలీజ్ కానుంది. ప్రస్తుతానికి ‘ప్రశాంత్ నీల్’ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు తారక్. ‘డ్రాగన్’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ సినిమాను 2026 జూన్ 25న రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఇక ‘డ్రాగన్’ షూటింగ్ అయిపోయిన వెంటనే ‘దేవర 2’ మొదలు కానుందనే టాక్ ఉంది. ఆ మధ్య ఎన్టీఆర్ కూడా ‘దేవర 2’ లేదనుకునే వారికి చెబుతున్నా, ఖచ్చితంగా ఈ సినిమా ఉంటుందని.. చెప్పుకొచ్చాడు. దీంతో.. దేవర ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. కానీ ఇప్పుడు ‘త్రివిక్రమ్’తో భారీ మైథలాజికల్ ప్రాజెక్ట్ కమిట్ అయ్యాడు తారక్. దీంతో.. ‘దేవర 2’ పరిస్థితేంటి? అనే చర్చ మొదలైంది.
Read Also:OGకి వీరమల్లు దెబ్బ.. లేదంటేనా?
‘ఎన్టీఆర్’ కమిట్మెంట్స్ ప్రకారం.. 2026లో డ్రాగన్, 2027లో నెల్సన్ దిలీప్ కుమార్, 2028లో త్రివిక్రమ్ సినిమాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన ‘దేవర’ సీక్వెల్ ఇప్పట్లో ఉండదా? అనే ప్రచారం మొదలైంది. కానీ ‘ఎన్టీఆర్’ మాత్రం ‘దేవర 2’ ఉంటుందని బల్లగుద్ది మరి చెప్పాడు. మరోవైపు ‘కొరటాల శివ కూడా ‘ స్క్రిప్ట్ వర్క్‌తో బిజీగా ఉన్నాడు. అయినా కూడా ‘దేవర 2’ పై అనుమానాలు వెలువడుతున్నాయి. కానీ ఎన్టీఆర్ చెప్పినట్టుగా.. డ్రాగన్ తర్వాత ‘దేవర 2’నే ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే.. ‘ఆచార్య8 వంటి ఫ్లాప్ తర్వాత ‘కొరటాల’తో సినిమా అవసరమా? అనే కామెంట్స్ వచ్చాయి. అయినా కూడా ఒక్క ‘ఎన్టీఆర్’ మాత్రమే ‘కొరటాల’ను నమ్మాడు. ఫైనల్‌గా ‘దేవర’ హిట్ అయింది. కాబట్టి.. ‘దేవర 2’ని వెనక్కి తీసుకెళ్లే అవకాశాలు చాలా తక్కువ. అయినా కూడా మేకర్స్ నుంచి క్లారిటీ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే!