Bhuma AkhilaPriya : ఆళ్ళగడ్డ నియోజకవర్గంలో ఇటీవల కురిసిన వర్షాలకు భారీగా పంట నష్టం వాటిల్లింది. దీంతో నష్టపోయిన రైతులను మాజీమంత్రి భూమా అఖిలప్రియ పరామర్శించారు. ఒక్క గ్రామంలోనే సుమారు రూ. 8 కోట్ల పంట నష్టం జరిగిందని మాజీ మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ప్రభుత్వం తమ నియోజకవర్గాన్ని మరిచిపోయిందని ఆమె ఆరోపించారు. అంతే కాకుండా ప్రభుత్వం దృష్టిలో ఆళ్లగడ్డ అనేది ఉందా లేదా? లేక మర్చిపోయిందా అని ప్రశ్నించారు. అధికారపార్టీ వైసీపీ ఎమ్మెల్యే హడావిడిగా రెండు గ్రామాలు తిరిగి ఫోటోలు దిగి వెళ్లిపోయారని ఆరోపించారు. ఏదో సాధిస్తానని సీఎం దగ్గరికి వెళ్లి ఆళ్లగడ్డలో వాన పడిందని నవ్వి ఫోటోలు దిగారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం బాధితులను ఆదుకోకపోతే పార్టీలకు అతీతంగా రైతులతో ఆందోళన చేస్తామని అఖిల ప్రియ హెచ్చరించారు.
Read Also: Viral: తల్లి, అమ్మమ్మ, అత్త, కోడలు ఒకేసారి ప్రెగ్నెంట్ అయితే.. ?
ఎమ్మెల్సీ ఎన్నికలలో అధికారపార్టీ పట్టబధ్రులు బుద్దిచెప్పారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు రైతు పక్షపాతి అని చెప్పుకునే మీకు రైతులే వచ్చే ఎన్నికలలో బుద్దిచెబుతారంటూ భూమా అఖిల జోస్యం చెప్పారు. చుట్టుపక్కల గ్రామాల్లో ఇంత పంట నష్టం జరిగితే జిల్లా కలెక్టర్ ఎందుకు దిగి రాలేదని ప్రశ్నించారు. మూడు రోజులు నుండి కరెంట్, తాగునీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని నిలదీశారు. రైతులు తిరగబడితే ప్రభుత్వాన్ని కూల్చడం కాదు మీకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తారని ఆగ్రహించారు.