తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ్టితో గ్రామ సర్పంచ్ ల పదవీ కాలం ముగియనుంది. ఇక పాలనను అధికారులకి అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎన్నికల షెడ్యూల్ వచ్చే వరకు తమనే పదవిలో కొనసాగించాలని సర్పంచుల సంఘం కోరింది. అయితే పొడిగింపుపై తెలంగాణ సర్కార్ స్పందించలేదు.. గత ప్రభుత్వ హయంలో సకాలంలో నిధులు రాకపోవడంతో గ్రామ పంచాయతీలు దీవాల తీశాయి. దీంతో పెండింగ్‌లో ఉన్న బిల్లులతో పాటు తమ పదవిని పొడిగించాలన్న సర్పంచులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే తమ పెండింగ్‌లో ఉన్న బిల్లులు మంజూరు చేసిన తర్వాత స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగించాలని అన్ని పార్టీలకు చెందిన సర్పంచులు కోరుతున్నారు. ఇక, రేపటి నుంచి స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగుతుందని ప్రభుత్వం ఇప్పటికే వెల్లడించింది.
Read Also: Delhi Fog: ఢిల్లీని కమ్మేసిన దట్టమైన పొగమంచు.. 50కి పైగా విమానాలకు అంతరాయం!
అయితే, మరికొద్ది గంటలలో సర్పంచులు తమ పదవి కాలం ముగియడంతో చాల మంది అప్పులు తెచ్చి గ్రామంలో అభివృద్ధి పనులు చేశారు. కొత్త గ్రామ పంచాయతీల నిర్మాణం, శ్మశాన వాటిక, ప్రకృతి వనం లాంటి కార్యక్రమాలని గత ప్రభుత్వం టార్గెట్ గా పెట్టింది. దీంతో చాలా మంది సర్పంచులు ఈ పనులను పూర్తి చేసి అప్పుల పాలయ్యారు. కానీ బిల్లుల మంజూరులో కేసీఆర్ సర్కార్ తీవ్ర జాప్యం చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో అధికార పార్టీకి చెందిన సర్పంచులే ఆందోళన చేశారు. ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో కొందరు సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారు. దీనికి తొడు రెండేళ్ళు కరోనా కారణంగా శానిటేషన్ ఇతర పరిశుభ్రత కోసం గ్రామ పంచాయతీ ప్రత్యేకంగా నజర్ పెట్టింది. ఆ నిధులు కూడా మంజూరు కాలేదు.. దీంతో సర్పంచులే ఏదో విధంగా నిధులని జమ చేసుకున్నారు. ఇక, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సర్పంచుల సమస్యలపై మాజీ మంత్రి కేటీఆర్ నిలదీశారు. అయితే కేటీఆర్కి కాంగ్రెస్- బీజేపీ పార్టీల నేతలు కౌంటర్ ఇచ్చారు. గత ప్రభుత్వం హయంలో చేసిన తప్పుల కారణంగానే గ్రామ పంచాయతీలు ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడాయని ఆరోపించారు.