యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘తండేల్’. పాన్ ఇండియా డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన ప్రమోషన్స్ కంటెంట్ హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేసింది. చిత్ర ప్రమోషన్స్ లో టీమ్ ఫుల్ బిజీ బిజీగా ఉంది.
Also Read : Priyanka Chopra : ప్రియాంక చోప్రా లేటెస్ట్ ఫోటోస్.. ఇవి చాలా హాట్ గురూ
ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర హీరో నాగ చైతన్య చేసిన కామెంట్స్ ఇంట్రెస్టింగ్ మారాయి. అలాగే తండేల్ సక్సెస్ మీట్ ను శ్రీకాకుళంలో నిర్వహిస్తామని అని అన్నాడు. ఈ వ్యాఖ్యలు తండేల్ పట్ల చైతన్య ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడో తెలియజేస్తున్నాయి. నాగ చైతన్య కెరీర్ లోనే బిగ్ బడ్జెట్ సినిమాగా తండేల్ తెరకెక్కింది. సుమారు రూ. 75 కోట్లతో ఈ సినిమాను తెరకెక్కించినట్టు బన్నీ వాసు పలు ఇంటర్వ్యూలలో తెలిపాడు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయగా ఊహించిన దాని కంటె ఎక్కువగా బుకింగ్స్ జరుగుతున్నాయి. నాగ చైతన్య కెరీర్ లో బిగ్గెస్గ్ ఓపెనింగ్ డే కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ అంచనా వేస్తుంది. పోటీలో మారే సినిమా లేకపోవడంతో తండేల్ కు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదల కాబోతుంది. సాయి పల్లవి, నాగ చైతన్య కాంబో వెండితెరపై మ్యాజిక్ చేస్తుందని టీమ్ చాలా కాన్ఫిడెంట్ గ ఉంది. రిలీజ్ కు ముందే సక్సెస్ మీట్ ప్లేస్ ఫిక్స్ చేసిన చైతు నమ్మకాన్ని తండేల్ నిలబెడుతుంతో లేదో మరొక్క రోజులో తెలుస్తుంది.