హిమాయత్ నగర్ దోపిడీ కేసును తెలంగాణ పోలీసులు ఛేదించారు. తక్కువ సమయంలో కేసును ఛేదించి శభాష్ అనిపించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దోపిడీ జరిగిన వెంటనే అన్ని డిపార్ట్మెంట్స్ అప్రమత్తమయ్యి నిందితులను పట్టుకోవడం జరిగిందని తెలిపారు.. మూడు కోట్ల రూపాయల సొత్తు దొంగిలించారని.. సొత్తు విలువ బహిరంగ మార్కెట్ విలువ అయిదు కోట్లు పైనే ఉంటుందన్నారు..