Telangana CM: తెలంగాణలో భారత్ సమ్మిట్ నిర్వహించబోతున్నాం..
- తెలంగాణలో భారత్ సమ్మిట్ నిర్వహించబోతున్నాం..
- సౌత్ ను లిమిటేషన్ చేసేందుకే డీలిమిటేషన్ ప్రక్రియ..
- డీలిమిటేషన్ పై తెలంగాణలో జరిగే అఖిలపక్ష భేటీకి కిషన్ రెడ్డి రావాలి: సీఎం రేవంత్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana CM: ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా మీడియాతో చిట్ చాట్ లో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో భారత్ సమ్మిట్ నిర్వహించబోతున్నాం.. దానికి సంబంధించినటువంటి అంశాలపై కేంద్ర విదేశాంగ శాఖ మంత్రితో ఇవాళ చర్చిస్తాను.. డీలిమిటేషన్ అనేది సౌత్ ను లిమిటేషన్ చేయడానికే.. డీలిమిటేషన్ పై తెలంగాణలో జరిగే అఖిలపక్ష సమావేశానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కచ్చితంగా హాజరు కావాలన్నారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాల్లో కేంద్రం తీసుకునే నిర్ణయాల్లో కేంద్ర మంత్రులు కచ్చితంగా కీలకపాత్ర పోషిస్తారు అని పేర్కొన్నారు. గాంధీ కుటుంబంతో రేవంత్ రెడ్డికి బలమైన సంబంధాలు ఉన్నాయి.. ఈ విషయంలో ఎవరు ఎటువంటి ప్రచారాలు చేసిన ఇబ్బంది లేదు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.
Read Also: Chennai: దారుణం.. భార్య, ఇద్దరు పిల్లలతో సహా వైద్యుడు ఆత్మహత్య
Also Read
- Story Board: హైదరాబాద్‌లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్‌కు ట్రంప్ తాజా హెచ్చరిక
ఇక, కావాలనే కొందరు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు అని సీఎ రేవంత్ తెలిపారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో పలువురు నేతలకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నాను.. అందులో భాగంగానే నామినేటెడ్ పదవులు, ఎమ్మెల్సీలు, ఇతర పదవులు కేటాయింపులు జరుగుతున్నాయన్నారు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పి పాలన చేయాలనేదే నా ఆలోచన.. అందుకే అప్పుల గురించి వాస్తవాలు ప్రజల ముందు పెడుతున్నాను.. ఇక, గవర్నర్ ప్రసంగం రోజే కాదు చర్చల్లో కూడా కేసీఆర్ పాల్గొనాలి అని ఆయన డిమాండ్ చేశారు. డీ లిమిటేషన్ అనేది లిమిటేషన్ ఫర్ సౌత్ అన్నారు. పార్టీలో కష్టపడి పని చేసిన వారికి నేను ఇచ్చిన హామీలు అమలు చేశా.. పార్టీ పెద్దలలో ఫోటోలు దిగి చూపించాల్సిన అవసరం లేదు.. నేను ఎవరో తెలీకుండానే పీసీసీ, సీఎంగా చేశారా అని ప్రశ్నించారు. నేను ఎవరి ట్రాప్ లో పడను.. సీఎంగా నేను ఉన్నాను కాబట్టే రాష్ట్రంలో నన్ను ప్రశ్నిస్తున్నారు.. కేంద్రమంత్రిగా కిషన్ రెడ్డి ఉన్నారు.. కాబట్టి ఆయన రాష్ట్రానికి సంబంధించిన అంశాలు సాధించడానికి రావాలని ప్రశ్నిస్తున్నారు.. మిగతా రాష్ట్రాల కేంద్రమంత్రులు వాళ్ళ రాష్ట్రాలకు కావాల్సినవి సాధించుకుంటున్నారు.. కిషన్ రెడ్డి రాష్ట్రానికి రావాల్సినవి పట్టించుకోవడం లేదని రేవంత్ రెడ్డి అన్నారు.
Read Also: Champion : మొత్తానికి నాలుగేళ్ల తర్వాత దర్శనం ఇచ్చిన స్టార్ కిడ్..
అయితే, మెట్రో హైదారాబాద్ కి గేమ్ ఛేంజర్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. 10 ఏళ్లలో కేసీఆర్ ఒక్క పాలసీ కూడా తేలేదు.. తెలంగాణలో నేను చేసినన్ని పాలసీలు ఎవరు చేయలేదు అని పేర్కొన్నారు. నిరుద్యోగాన్ని 8.8 నుంచి 6.1 శాతానికి తగ్గించాం.. 2.2 లక్షల కోట్ల పెట్టుడులు తెలంగాణకి తెచ్చాం.. పన్ను వసూళ్లలో తెలంగాణ ముందంజలో ఉంది.. రాష్ట్రంలో పంటలు ఎండిపోతుంటే, టన్నెల్ లో ప్రాణాలు పోతుంటే, ప్రజలు కష్టాల్లో ఉంటే బీఆర్ఎస్ నేతలు డ్యాన్సులు వేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు అని ఆరోపించారు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్‌లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్‌కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్‌లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!