Vijay: తమిళగ వెట్రీ కజగం (టీవీకే) చీఫ్, తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ శనివారం తన రాష్ట్రవ్యాప్త పర్యటనను ప్రారంభించారు. తిరుచిరాపల్లి నుంచి తన తొలి రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుట్టారు. కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో డీఎంకేలు రెండూ కూడా ప్రజల్ని మోసం చేస్తున్నాయని ఆరోపించారు. వారు ఇచ్చిన హామీలు విఫలమయ్యాయని అన్నారు. రాజులు యుద్ధానికి వెళ్లే ముందు దేవాలయాల్లో ప్రార్థనలు చేసినట్లుగా, 2026 ప్రజాస్వామ్య యుద్ధానికి సిద్ధమయ్యే ముందు ప్రజలను కలవడానికి వచ్చానని…
Supreme Court: తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. డీలిమిటేషన్‌పై ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం తిరస్కరించింది. న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పును వెల్లడించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 ప్రకారం, దేశంలో తదుపరి జనాభా లెక్కలు (జనగణన) జరిగే 2026 తర్వాతే అసెంబ్లీ సీట్ల పెంపు (డీలిమిటేషన్) సాధ్యమని స్పష్టం చేసింది. iOS 26 Public Beta: లిక్విడ్ గ్లాస్ డిజైన్‌తో…
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కి తిరిగే లేని.. ఎవరు ఎదుర్కోలేరని సీఎం రేవంత్‌రెడ్డి ఆశా భావం వ్యక్తం చేశారు. జులై 4 న హైదరాబాద్‌కి ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే వస్తున్నట్లు వెల్లడించారు. అదే రోజు పొలిటికల్ అఫైర్స్ కమిటి సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
MK Stalin: తమిళనాడు రామేశ్వరంలో కొత్త పంబన్ వంతెన ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్రమోడీ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పాల్గొన్నారు. అయితే, ప్రోటోకాల్ ప్రకారం రావాల్సిన, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఈ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. అయితే, డీలిమిటేషన్ గురించి తమిళ ప్రజల భయాలను తొలగించడానికి ప్రధాని మోడీ నుంచి హామీ కావాలని స్టాలిన్ డిమాండ్ చేశారు. పార్లమెంటరీ సీట్ల వాటా శాతం మారకుండా కసరత్తు చేయాలని కోరారు.
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు మధ్య కేంద్ర నిధులపై ఆసక్తికరమైన చర్చ చోటుచేసుకుంది. బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేటీఆర్‌పై విమర్శలు గుప్పించారు. గత పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం అనేక నిధులు కేటాయించిందని, బీబీ నగర్ ఎయిమ్స్ వంటి ప్రాజెక్టులను మంజూరు చేసిందని ఆయన పేర్కొన్నారు. కేటీఆర్ తరచూ కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. కేంద్రం గత…
సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో డీ లిమిటేషన్‌పై తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం ఆయన ప్రసంగించారు. పునర్విభజన పారదర్శనకంగా జరగాలన్నారు. "జనాభా నియంత్రణ శాపం కాకూడదు. జనాభా వాటా తగ్గిన రాష్ట్రాలు నష్టపోకూడదు. జనాభా ఒక్కటే ప్రామాణికం కాకూడదు. రాష్ట్రాన్ని యూనిట్ గా తీసుకుని నియోజక వర్గ పునర్విభజన చేయాలి. వాజ్ పేయి కూడా పునర్విభన 25 ఏళ్లు వాయిదా వేశారు. జనాభా ప్రాతిపదికన నియోజక వర్గాల పునర్విభజన చేయాలని ఆలోచన సరికాదు. కేంద్రమే నిర్ణయం తీసుకోలేదు అని కేంద్ర…
డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. డీలిమిటేషన్ వల్ల జనాభా నియంత్రణ శాపం కాకూడదన్నారు. డీలిమిటేషన్ వల్ల జనాభాను నియంత్రించిన రాష్ట్రాలు నష్టపోకూడదని, ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాలనే కొనసాగించాలన్నారు. పునర్విభజనకు జనాభా ఒక్కటే ప్రామాణికం కాకూడదని, రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకుని నియోజకవర్గ పునర్విభజన చేయాలన్నారు. అన్ని పార్టీలతో సంప్రదింపుల తర్వాతనే లోక్‌సభ సీట్ల పునర్విభజన చేయాలని సీఎం పేర్కొన్నారు. ‘ పునర్విభజన పారదర్శనకంగా జరగాలి.…
డీలిమిటేషన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రానికి డీలిమిటేషన్ వల్ల నష్టం కలుగుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. కేంద్రానికి లేఖ రాయడం సంతోషం అన్నారు.. ఇక, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. డీలిమిటేషన్‌పై పార్లమెంటులో మాట్లాడాలనడం గోడ మీద పిల్లి వాటం అంటూ ఎద్దేవా చేశారు.. బీజేపీని కాదనలేక సర్కస్ ఫీట్లు వల్ల రాష్ట్రానికి ఏ ప్రయోజనం లేదన్నారు.
KTR : కరీంనగర్ జిల్లాలో కేంద్రమంత్రి బండి సంజయ్ చేసిన దొంగనోట్ల ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. కేంద్రమంత్రిగా ఉన్న బండి సంజయ్ తాము దొంగనోట్లను ముద్రించారని ఆరోపించడం విచిత్రమని వ్యాఖ్యానించారు. బండి సంజయ్ ఆరోపణలపై స్పందించిన కేటీఆర్, “మీరు కేంద్రమంత్రిగా ఉండి మమ్మల్ని దొంగలు అంటారు. అయితే, అప్పుడు కర్ణాటకలో మీరే అధికారంలో ఉన్నారు కదా? దర్యాప్తు చేసి నిజాలు బయటపెట్టాల్సింది మీరే!” అని వ్యాఖ్యానించారు. నిరాధార ఆరోపణలు చేయడం బీజేపీ…