టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ వారసుడిగా ‘పెళ్లి సందడి’ మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు రోషన్. మొదటి చిత్రంతోనే తన హీరోయిజం చూపించిన రోషన్, తన తదుపరి చిత్రం అనౌన్స్ చేసి నాలుగు సంవత్సరాలు గడిచిపోయాయి. 2021 తర్వాత ఈ కుర్రాడు తిరిగి తెరమీద కనిపించలేదు. బడా ఆఫర్లు వచ్చినా కథల ఎంపికలో జాగ్రత్తలు వహింసిస్తున్నా రోషన్.. ఎట్టకేలకు ఈ ఇయర్ రెండు సినిమాలతో రాబోతున్నాడు. వాటిలో మొదటిది ‘ఛాంపియన్’. ప్రముఖ నిర్మాణ సంస్థ స్వప్న సినిమా బ్యానర్ పై ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో రూపొందుతుంది. కాగా స్పోర్ట్స్ కం యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీలో రోషన్ ఫుట్ బాల్ ప్లేయర్‌గా ఇంటెన్స్ లుక్‌లో కనిపించబోతున్నాడు. ఇక ఇవాళ రోషన్ బర్త్ డే సందర్భంగా చిన్న టీజర్ వదిలారు మేకర్స్.
Also Read : Malavika : మీరు వర్జినా? నేరుగా ఆ స్టార్ హీరోయిన్‌ని క్వశ్చన్ చేసిన నెటిజన్
నలభై సెకండ్ల వీడియోలో కథను రివీల్ చేయలేదు కానీ, రోషన్‌ని మేకర్స్ పరిచయం చేసిన తీరు అంచనాలు పెంచేసింది. ఈ మూవీకి మిక్కీ జె మేయర్ సంగీతం సమకూర్చిన టాప్ టెక్నీషియన్లు పని చేస్తున్నారు. క్యాస్టింగ్ తదితర వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నాయి. కాగా ఈ సినిమాను 2023 లో ప్రకటించారు. కానీ అనివార్య కారణాల వల్ల సకాలంలో పూర్తి కాలేదు. అశ్వినీదత్ లాంటి అగ్ర నిర్మాత బ్యానర్ లో వస్తున్న సినిమా అయినా ఎందుకు ఇంత ఆలస్యం అయింది తెలియడం లేదు. మొత్తానికి ఈ ‘ఛాంపియన్’ ని 2025 లో విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కాకపోతే డేట్ ఇంకా ఖరారు కాలేదు.