Uttam Kumar Reddy : దళిత స్పీకర్‌ను అవమానపరిచేట్లు మాట్లాడడం సరికాదు
- జగదీశ్ రెడ్డి స్పీకర్ పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్న
- చైర్ కి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వడం లేదు
- స్థాయిని తగ్గించి వ్యంగ్యంగా మాట్లాడి జగదీశ్ రెడ్డి స్పీకర్ ను అవమాన పరిచారు : మంత్రి ఉత్తమ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttam Kumar Reddy : తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర విమర్శలకు దారితీశాయి. ఈ అంశంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ, జగదీష్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు. గురువారం అసెంబ్లీలో మీడియాతో చిట్‌చాట్ నిర్వహించిన మంత్రి ఉత్తమ్, ప్రజాస్వామ్యంలో స్పీకర్ పదవికి ప్రత్యేకమైన గౌరవం, అధికారాలు ఉంటాయని గుర్తు చేశారు. “ఒక సభ్యుడు స్పీకర్‌పై ఇంత అహంకారంగా మాట్లాడటం నేను ఎప్పుడూ చూడలేదు. జగదీష్ రెడ్డి వ్యాఖ్యలపై తక్షణమే నిర్ణయం తీసుకోవాలి. దీన్ని సాధారణంగా తీసుకోవడం తగదు,” అని ఆయన వ్యాఖ్యానించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారని, జగదీష్ రెడ్డి వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.
CM Chandrababu: విద్యుత్తు రంగంలో ఎన్నో సంస్కరణలు టీడీపీ తెచ్చింది..
Also Read
- Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. భుజంగరావుకు 14 రోజుల రిమాండ్
- రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
- MP: ‘సారీ అమ్మా, నాన్న.. మళ్లీ పరీక్ష రాసే ధైర్యం లేదు’.. కన్నీరు పెట్టిస్తున్న నీట్ విద్యార్థిని సూసైడ్ నోట్
- SL vs WI: కెప్టెన్‌గా కుసాల్ మెండిస్ బోణి.. వెస్టిండీస్‌పై శ్రీలంక ఘన విజయం.!
అంతకుముందు సభలో మాట్లాడిన జగదీష్ రెడ్డి, “మేము కూడా ప్రజల చేత ఎన్నుకోబడ్డవారమే. మీరూ మేము ఎన్నుకుంటేనే స్పీకర్ అయ్యారు. ఈ సభ మీ సొంతమేం కాదు,” అంటూ స్పీకర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ మాటలతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహంతో స్పందించారు. మంత్రి శ్రీధర్ బాబు జోక్యం చేసుకుంటూ, “స్పీకర్‌ను బెదిరించడం, ఆయన పదవిని అపహాస్యం చేయడం సరైనది కాదు. జగదీష్ రెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని, క్షమాపణ చెప్పాలి,” అని తీవ్రంగా హెచ్చరించారు. ఈ వివాదం అసెంబ్లీలో ఉద్రిక్త పరిస్థితులను తీసుకువచ్చింది, స్పీకర్ గౌరవాన్ని కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
IPL 2025: అయ్యర్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేయకపోవడానికి కారణం అదే: వెంకీ
తాజావార్తలు
-
OTT : పెద్ద సినిమాలకు ఓటీటీ డీల్ కాకుంటే రిలీజ్ డేట్ ప్రకటించరా?
-
Google AI Scam Call Detection: గూగుల్ నుంచి కొత్త AI స్కామ్ కాల్ డిటెక్షన్ ఫీచర్.. యూజర్లకు భారీ ఊరట
-
Donald Trump: సొంత పార్టీ నుంచే ట్రంప్‌కు ఎదురుదెబ్బ! అమెరికా పార్లమెంట్లో సంచలనం.. ఏం జరిగిందంటే?
-
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. భుజంగరావుకు 14 రోజుల రిమాండ్
-
IRCTC: నకిలీ బుకింగ్‌లపై పట్టు బిగించిన ఐఆర్ సీటీసీ.. 3.03 కోట్ల అనుమానాస్పద ఐడీలు డీయాక్టివేట్
ట్రెండింగ్
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!