Governor Jishnu Dev Varma : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ప్రారంభంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ఘనమైన సంస్కృతికి నిలయమని, అన్ని వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ప్రజల కోసం గద్దర్, అంజయ్య వంటి మహానుభావులు అంకితభావంతో కృషి చేశారని గుర్తు చేశారు. “జననీ జయకేతనం” ను రాష్ట్ర గీతంగా స్వీకరించిన విషయాన్ని ప్రస్తావించారు. ప్రభుత్వం సామాజిక న్యాయం, అభివృద్ధి లక్ష్యంగా పాలన సాగిస్తోందని స్పష్టం చేశారు. తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించామని తెలిపారు. ఈ బడ్జెట్ పూర్తిగా తెలంగాణ ప్రజల కలల సాకారానికి ప్రతిబింబమని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమాన్ని కేంద్రంగా చేసుకుని ప్రభుత్వం పాలన కొనసాగిస్తోందని గవర్నర్ తన ప్రసంగంలో స్పష్టం చేశారు.
అంతేకాకుండా.. TGPSCని బలోపేతం చేశాం. రూ.500 కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామన్నారు. దేశంలోనే అత్యధికంగా తెలంగాణలో వరి ఉత్పత్తి అవుతోందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థుల కోసం మెస్ ఛార్జీలు పెంచినట్లు, డైట్ ఛార్జీలు 40 శాతం, కాస్మెటిక్ ఛార్జీలు 200 శాతం పెంచినట్లు గవర్నర్ ప్రసంగంలో తెలిపారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ స్కీమ్ ప్రారంభించినట్లు ఆయన పేర్కొ్న్నారు. సమగ్ర సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల సర్వే నిర్వహించామని, శాస్త్రీయ పద్ధతిలో పారదర్శకంగా సర్వే నిర్వహించామన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనకు కట్టబద్ధత కల్పించేందుకు ప్రభుత్వం బిల్లు ప్రతిపాదించిందని ఆయన వెల్లడించారు. షెడ్యూల్డ్ కులాల ఉపవర్గీకరణ కోసం బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుందని ఆయన అన్నారు. చేనేత కార్మికుల కోసం తెలంగాణ చేనేత అభయహస్తం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దావోస్‌లో తెలంగాణ ప్రభుత్వం రూ. 1,78,950కోట్ల పెట్టుబడులను ఆకర్షించిందని ఆయన తెలిపారు.
RC 16 : బూత్ బంగ్లాలో చరణ్ – బుచ్చిబాబు షూటింగ్