PMBJP Warehouse Inaugurated in Uppal: గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భారతీయ జన ఔషధీ పరియోజన ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి భారతీయ జనసౌది పరియోజన (PMBJP) తెలంగాణ మార్కెటింగ్ కం డిస్ట్రిబ్యూషన్ వేర్ హౌస్ ను లార్విన్ ఫార్మా అండ్ సర్జికల్ వారి సహకారంతో ఉప్పల్ ఇండస్ట్రియల్ ఏర్పాటు చేశారు.. ఈ వేర్ హౌస్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ హాజరయ్యారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ ఈటెల రాజేందర్,…
Governor Jishnu Dev Varma : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ప్రారంభంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ఘనమైన సంస్కృతికి నిలయమని, అన్ని వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ప్రజల కోసం గద్దర్, అంజయ్య వంటి మహానుభావులు అంకితభావంతో కృషి చేశారని గుర్తు చేశారు. “జననీ జయకేతనం” ను రాష్ట్ర గీతంగా స్వీకరించిన విషయాన్ని ప్రస్తావించారు. ప్రభుత్వం సామాజిక న్యాయం,…
తాను దత్తత తీసుకున్న కొండపర్తి గ్రామానికి గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ రోడ్డు మార్గాన చేరుకున్నారు. మంత్రి సీతక్క, కిషోర్ ప్రినిపల్ సెకరెట్రి, కలెక్టర్ దివాకర, ఐటీడీఏ పీఓ చిత్ర మిశ్రా ఘన స్వాగతం పలికారు. ఆదివాసీలు వారి నృత్యాలతో ఆకట్టుకున్నారు. కుమురం భీమ్, బిర్శా ముండా విగ్రహాలకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, మంత్రి సీతక్క ఆవిష్కరించారు. పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రామ అభివృద్ధి నిమిత్తం రూ. కోటి 50 లక్షల విలువైన పనులు ప్రారంభించారు.
తెలంగాణ ప్రభుత్వం జేఎన్‌టీయూ హైదరాబాద్ యూనివర్సిటీకి వీసీని నియమించింది. వైస్ ఛాన్సలర్ గా టీ కిషన్ కుమార్ రెడ్డిని నియమించింది. వీసీ నియామకానికి సంబంధించిన ఫైల్ పై రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సంతకం చేయడంతో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జేఎన్‌టీయూ వీసీగా కిషన్ కుమార్ రెడ్డి.. పదవీ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి మూడేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగనున్నారు. గతేడాది మే 21న ఖాళీ అయిన వర్సిటీ వీసీ పోస్టును భర్తీ చేసేందుకు…
Jishnu Dev Varma: మెదక్ చర్చి వందేళ్ల వేడుకకు రావడం సంతోషంగా ఉందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. చర్చి వందేళ్లు పూర్తి చేసుకోవడమే కాదు.. యేసు ప్రేమను కూడా వందేళ్లుగా పంచుతుందని అన్నారు.
కుల గణన, మూసి ప్రక్షాళనపై గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, సీఎం రేవంత్ భేటీలో చర్చ జరిగింది. మూసి ప్రక్షాళనపై సీఎంతో గవర్నర్ ఆరా తీశారు. పేదలు నష్టపోకుండా చూడాలని.. పరిహారం అందించడంలో ఉదారంగా ఉండాలని సీఎంకి గవర్నర్ సూచించారు. పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు కేటాయించినట్లు సీఎం ఆయనకు తెలిపారు.
తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఖైరతాబాద్ మహా గణపతికి ప్రత్యేక పూజలు చేశారు. విగ్రహం దగ్గరకు వచ్చిన గవర్నర్ కు ఉత్సవ సమితి సభ్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. తర్వాత.. భారీ గణనాథుడికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రత్యేక పూజలు చేశారు.