బంగారం ధరలు జెట్ స్పీడ్ తో పరుగెడుతున్నాయి. పెరుగుతున్న ధరలు గోల్డ్ లవర్స్ ను కంగారు పెట్టేస్తున్నాయి. శుభకార్యాల వేళ పుత్తడి ధరలు ఆకాశాన్ని తాకుతుండడంతో కొనుగోలు దారులు వెనకడుగు వేస్తున్నారు. గత కొద్ది రోజులుగా పెరుగుతూ వస్తున్న గోల్డ్ ధరలు నేడు మళ్లీ పెరిగాయి. మళ్లీ అదే జోరు చూపిస్తున్నాయి. తులం బంగారంపై ఏకంగా రూ. 490 పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
Also Read:Health Tips: వేసవిలో పిల్లలకు ఈ 4 ప్రత్యేక జ్యూస్‌లను ఇవ్వండి..
హైదరాబాద్ – ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ. 8,798, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ. 8,065 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 450 పెరగడంతో రూ. 80,650 వద్ద అమ్ముడవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 490 పెరగడంతో రూ. 87,980 వద్దకు చేరింది. విజయవాడ, విశాఖ పట్నంలో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 80,800గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. రూ. 88,130 వద్ద ట్రేడ్ అవుతోంది.
Also Read:Hyderabad: భారీగా కల్తీ నిత్యవసర వస్తువుల పట్టివేత
బంగారం ధరలు పైపైకి ఎగబాకుతున్న వేళ వెండి ధరలు కూడా షాకిస్తున్నాయి. నేడు వెండి ధరలు భారీగా పెరిగాయి. కిలో సిల్వర్ పై ఏకంగా రూ. 2000 పెరిగింది. హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర రూ. 1,09,000 వద్ద అమ్ముడవుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 1,00,000 వద్దకు చేరింది.