Jawahar Navodaya: తెలంగాణలో కొత్తగా మంజూరైన ఏడు జవహర్ నవోదయ విద్యాలయాల ప్రారంభానికి సంబంధించి తాజాగా విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర విద్యాశాఖ, నవోదయ విద్యాలయ సమితి (NVS) ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి నవోదయ విద్యాలయ సమితి హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం నుండి ఉపాయుక్తులు శ్రీ టి. గోపాల్ కృష్ణ, టి. సూర్యప్రకాశ్, బి. చక్రపాణి హాజరయ్యారు. అలాగే పాఠశాల విద్యా…
Mallu Ravi : కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. రేపటితో (జూన్ 2) 11వ తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పారు. ఈ సందర్భంగా మల్లు రవి, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సామాజిక న్యాయ కార్యక్రమాలను వివరించారు. మల్లు రవి మాట్లాడుతూ, “తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను గత ప్రభుత్వాలు…
దళితుల కోసం యుద్ధం చేసిన యోధుడు అంబేద్కర్ అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నెకల్లులో అంబేద్కర్ జయంతి కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ఈ రోజు మన అందరికి హక్కులున్నాయంటే దానికి కారణం అంబేద్కర్ అన్నారు.. 2003లో ఎస్సీ కమిషన్ ఏర్పాటు చేశామని.. చదువుకోవాలనే ఆశ ఉండే పిల్లలందరినీ చదివిస్తామని హామీ ఇచ్చారు. తొందర్లోనే మంచి స్కీంను తీసుకొస్తామని తెలిపారు. అమరావతికి దేశంలోని మంచి…
Governor Jishnu Dev Varma : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ప్రారంభంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ఘనమైన సంస్కృతికి నిలయమని, అన్ని వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ప్రజల కోసం గద్దర్, అంజయ్య వంటి మహానుభావులు అంకితభావంతో కృషి చేశారని గుర్తు చేశారు. “జననీ జయకేతనం” ను రాష్ట్ర గీతంగా స్వీకరించిన విషయాన్ని ప్రస్తావించారు. ప్రభుత్వం సామాజిక న్యాయం,…
Kishan Reddy : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు కోసం అధికారులు కృషి చేయాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దిశా కమిటీ సమావేశం అనంతరం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మైనారిటీలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం రెసిడెన్షియల్ స్కూల్స్, హాస్టళ్లు మంజూరు చేస్తే అనేక రాష్ట్రాల్లో సరైన రీతిలో అమలు కావడం లేదని, అంగన్ వాడీ స్కూళ్లు, బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్ల నిర్మాణానికి భూమి కొరత నెలకొందన్నారు కిషన్ రెడ్డి. నగరంలో…
CM Revanth Reddy: నేడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఇవాళ మధ్యాహ్నం.2 గంటలకు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్‌లోని కొందుర్గులో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌కు శంకుస్థాపన చేస్తారు.
విద్యార్థులే మా ప్రజా ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యత అని మంత్రి సీతక్క పేర్కొన్నారు. వారి సమస్యలు పరిష్కరించేలా అంతా కృషి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్స్, గురుకుల సంస్థల్లో, విద్యాబోధన మౌలిక వసతులు, భోజన వసతి, తదితర అంశాలపై మంత్రి సీతక్క సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఫుడ్ పాయిజన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ఉచిత, నిర్బంధ, విద్య హక్కు నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం పాటించడం లేదని పిటీషనర్ వాదనలు వినిపించాడు.
సంక్షేమ హాస్టళ్లకు కొత్తరూపు, సమగ్ర కార్యాచరణకు ఆదేశాలు జారీ చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. క్యాంపు కార్యాలయంలో సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లపై సమీక్ష నిర్వహించారు ఏపీ సీఎం.. ఈ సమావేశానికి మంత్రులు మేరుగ నాగార్జున, చెల్లుబోయిన వేణుగోపాల్ , ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.. ఈ సందర్భంగా సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు సీఎం జగన్.. ఏడాదిలోగా అన్నిరకాల హాస్టళ్లలో నాడు – నేడు కింద పనులు చేయాలని పేర్కొన్నారు.. స్కూళ్ల నిర్వహణా నిధిలానే…
దాదాపు 18 నెలల తర్వాత సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ప్రత్యక్ష బోధనకు సిద్ధమైంది తెలంగాణ ప్రభుత్వం.. అయితే, దీనిపై కీలక ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్టు… ఓవైపు రేపటి నుంచి తెలంగాణలో ప్రత్యక్ష తరగతులకు అనుమతి ఇస్తూనే.. విద్యాసంస్థల్లో ప్రత్యక్ష బోధనపై బలవంతం చేయవద్దన్న హైకోర్టు, విద్యార్థులు, మేనేజ్‌మెంట్‌పై ఒత్తిడి తేవద్దు.. పేరెంట్స్ నుంచి ఎలాంటి రాతపూర్వక హామీ తీసుకోవద్దని పేర్కొంది. కేవలం గురుకులాలు, హాస్టళ్లలో ప్రత్యక్ష బోధనపై హైకోర్టు స్టే విధించింది.. గురుకులాలు, విద్యాసంస్థల్లో…