హాట్ హాట్‌గా కొనసాగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. ఈనెల 9న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు 16వ తేదీకి వాయిదా వేశారు. మళ్లీ రెండవ రోజు (సోమవారం) ప్రారంభమైన అసెంబ్లీ.. ఈరోజుతో 7 రోజులు సమావేశాలు వాడీవేడిగా సాగాయి.
Telangana Assembly 2024: ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో రైతు భరోసాపై చర్చ జరగనుంది. నేడు సభలో ప్రశ్నోత్తరాలు రద్దు చేస్తూ నేరుగా రైతు భరోసాపై చర్చించనున్నారు.
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈరోజు ఆరో రోజు ప్రారంభమయ్యాయి. ఈరోజు ప్రశ్నోత్తరాల కార్యక్రమం రద్దు చేశారు. అయితే ఇవాళ శాసనసభ “భూ భారతి” బిల్లుపై చర్చతో ప్రారంభమైంది. ఆ తర్వాత రైతు బీమా పాలసీలపై లఘు చర్చ జరగనుంది. జీహెచ్‌ఎంసీ సవరణ బిల్లు, తెలంగాణ మున్సిపాలిటీల సవరణ బిల్లు, పంచాయతీరాజ్ సవరణ బిల్లులను సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి సీతక్క శాసనమండలిలో ప్రవేశపెట్టనున్నారు. మండలిలో రైతు బీమా పాలసీలపై స్వల్పకాలిక చర్చ జరగనుంది.
తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో డా.బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ ధర్నా చేస్తోంది. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ధర్నా చేస్తున్నారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు ఆందోళనలో పాల్గొన్నారు. అంబేడ్కర్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ ఈ ధర్నా చేస్తోంది. అంబేద్కర్ తమకు దేవుడు లెక్క అని, అమిత్ షా క్షమాపణలు చెప్పాలని పీసీసీ చీఫ్ డిమాండ్ చేశారు. Also…
శాసనసభలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మధ్య వాడీవేడి సంభాషణ జరిగింది. క్వశ్చన్ అవర్‌లో ఒక మంత్రి.. మరొక మంత్రిని ప్రశ్న అడగడం ఏంటని హరీశ్ రావు ప్రశ్నించారు. మంత్రులే ప్రశ్నలు అడిగితే.. ప్రశ్నోత్తరాలకు అర్థమే మారిపోతుందన్నారు. అందుకు కోమటిరెడ్డి ఘాటుగా స్పందించారు. హరీశ్ రావు బీఆర్ఎస్‌కు డిప్యూటీ లీడరా?, ఎమ్మెల్యేనా?.. ఏ హోదాతో మాట్లాడుతున్నారు?, ఆయనకు ప్రశ్నించే హక్కు లేదన్నారు. ప్రతిపక్ష నేత ఏడాదిగా సభకు రాకపోవడం తెలంగాణ ప్రజలను అవమానపరచడమే…
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. గురువారం ఐదవ రోజు వాడివేడిగా సమావేశం జరగనుంది. నేడు అసెంబ్లీలో నాలుగు ప్రభుత్వ బిల్లులతో సహా భూభారతి బిల్లుపై చర్చ కొనసాగనుంది. తెలంగాణ మున్సిపాలిటీ సవరణ బిల్లు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బిల్లు, తెలంగాణ పంచాయతీరాజ్ సవరణ బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. నేడు అసెంబ్లీలో ప్రభుత్వ అప్పులు, చెల్లింపులపై సహా రైతు భరోసాపై చర్చ జరగనుంది.
Telangana Assembly: సోమవారం నుంచి రాష్ట్ర శాసనసభ సమావేశాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ నెల (డిసెంబర్) 9న శాసనసభ, మండలి సమావేశాలు ప్రారంభం కాగా, తొలిరోజు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణపై ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.
TG Govt GO: తెలంగాణ తల్లి విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా గుర్తించింది. ఈ మేరకు బంగారు బోర్డర్‌తో కూడిన ఆకుపచ్చ చీరను ధరించి, ప్రశాంతమైన నడవడికతో సంప్రదాయ మహిళా మూర్తిగా ఉన్న ఈ విగ్రహం నేడు తెలంగాణ తల్లి విగ్రహంగా ఆమోదం పొందింది.