మసాలా కూరలు, మసాలా రైస్ లు బిరియానిలు, ఇలా స్పైసిగా ఉండే ఈ వంటకైనా అల్లం పేస్ట్ పడాల్సిందే.. లేకుంటే టేస్ట్ ఉండదు.. ముఖ్యంగా నాన్ వెజ్ లకు ఘాటు తగలాలంటే అల్లం పేస్ట్ దిట్టంగా వెయ్యాల్సిందే.. అయితే ఈమధ్య బద్ధకం పెరిగిపోయి కొందరు, చేసుకోవడానికి టైం లేకో కొందరు బయట దొరికే పేస్ట్ లను తెగ వాడేస్తారు.. ఈరోజుల్లో నాణ్యత అనే మాట కన్నా డబ్బులను చూసుకొనేవాళ్లు ఎక్కువైయ్యారు.. అల్లం పేస్ట్ లో కల్తీ ని చేస్తున్నారు.. ఇలాంటి ఘటనలు ఈ మధ్య హైదరాబాద్ లో ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి..
కల్తీకి అనర్హం కాదేది అన్నట్లు కల్తీగాళ్ళు రెచ్చిపోతున్నారు.. మొన్నీమధ్య జరిగిన దాడులను మరువక ముందే ఇప్పుడు మరో కల్తీ బాగోతం బయటపడింది.. రంగారెడ్డి జిల్లాలో కల్తీ చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి కొన్ని ముఠాలు. వంటల్లో వాడే అల్లం పేస్ట్‌లో ప్రమాదకర కెమికల్స్ కలుపుతోంది ఓ ముఠా. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో ఓసారి కల్తీ అల్లం పేస్ట్ తయారు చేస్తున్నవారిని పోలీసులు పట్టుకున్నారు.. తాజాగా మరోసారి కల్తీ అల్లం పేస్ట్ తయారు చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు..
ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న వారిపై దాడులు జరిపారు అధికారులు.. ఉప్పరపల్లిలో ఎలాంటి నియమ నిబంధనలు పాటించకుండా ప్రమాదకర కెమికల్స్ కలుపుతూ, శుభ్రత పాటించకుండా ఓ ముఠా అల్లం పేస్ట్ తయారు చేస్తున్నారు. ఈ విషయం పై సమాచారం అందుకున్న పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించి వారి వద్ద నుంచి 3.5 టన్నుల కల్తీ అల్లాన్ని స్వాధీనం చేసుకున్నారు. అల్లం పేస్టు నిర్వాహకులు దిల్దర్ అలీ జాన్సన్, సోనుకుమార్ లను అదుపులోకి తీసుకున్నారు.. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..