Gorantla Butchaiah Chowdary: ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో.. ఈ సారి టికెట్ వచ్చేది ఎవరికి? సిట్టింగ్‌లకు అవకాశం ఉంటుందా? ఉండదా? అనే చర్చ సాగుతోంది.. అయితే, వచ్చే ఎన్నికలలో టీడీపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మళ్ళీ టిక్కెట్లు ఇస్తారని ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు , రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పష్టం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబే స్వయంగా చెప్పినట్లు తెలిపారు. రాజమండ్రి రూరల్ టికెట్టు పొత్తులో భాగంగా జనసేనకు కేటాయిస్తారని వస్తున్న వదంతులు నేపధ్యంలో తనకే మళ్లీ టికెట్టు అని బుచ్చయ్య క్లారిటీ ఇచ్చారు.
Read Also: Gudivada Amarnath: ఏపీలో బీజేపీ లేదు అది టీజేపీ.. షా కామెంట్లపై గుడివాడ మార్క్ కౌంటర్లు
రాజమండ్రి రూరల్ తెలుగుదేశం పార్టీ సమావేశం అనంతరం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మీడియాతో మాట్లాడారు.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వల్ల కరెంట్ కోతలతో పేద ప్రజలు. పరిశ్రమలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు.. గతంలో 400 వచ్చే కరెంటు బిల్ ఇప్పుడు 1400 రూపాయలు వస్తుందని ఆరోపణలు గుప్పించారు. తెలుగుదేశం హయంలో 35 లక్షల కరెంట్ కనెక్షన్లు ఇస్తే.. వైసీపీ హయాంలో కేవలం 8 లక్షలు కూడా ఇవ్వలేదని వివరించారు. మరోవైపు.. వారాహి యాత్ర కొనసాగుతుంది.. చంద్రబాబు యాత్ర.. లోకేష్ యాత్ర సాగుతుంది. అది ఎవరూ ఆపలేరని సవాల్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా వైసీపీ సర్కార్‌పై మండి పడుతుందని గుర్తుచేశారు.. నిధులన్నీ గోల్ మాల్ అయిపోయాయని ఆరోపించారు టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి.
Read Also: V Madhusudhan Rao Shatajayanthi Celebrations: ఘనంగా విక్టరీ మధుసూదనరావు శతజయంతి వేడుకలు!
పవర్ కి కూడా హాలిడే ప్రకటించే దుస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందని బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడిన నాటి నుండి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం తీవ్రమైన విద్యుత్ సమస్యలు ఎదుర్కొంటున్నారు.. ఈవేళ కరెంట్ కోతలతో గృహ వినియోగదారులతో పాటు, ఆక్వా రైతులు, చేనేత కార్మికులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఈవేళ వాతావరణం చూస్తుంటే పెద్ద ఎత్తున ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. కరెంట్ పరిస్థితులు చుస్తే అప్రకటిత కోతలే మూడు నాలుగు గంటలు ఉంటున్నాయి. లోవోల్టెజ్ సమస్య తో ఫ్యాన్లు, ఏసీలు పని చేయకపోవడంతో ఉక్కపొతతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని విమర్శించారు.