TDP-Janasena First List: టీడీపీ- జనసేన పార్టీల తొలి జాబితా.. చంద్రబాబు- పవన్ ఉమ్మడి ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TDP-Janasena: మరో 50 రోజుల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో టీడీపీ- జనసేన ఉమ్మడిగా తొలి జాబితాను వెల్లడించాయి. చంద్రబాబు, పవన్ లు ఉమ్మడి ప్రకటనను విడుదల చేశారు. వివాదం లేని నియోజకవర్గాలకు తొలి జాబితాలో రెండు పార్టీలు చోటు కల్పించారు. బీజేపీతో పొత్తు కుదిరిన తర్వాత రెండో జాబితాను రిలీజ్ చేసేందుకు నిర్ణయించారు. ప్రస్తుతానికైతే 118 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించారు. 94 స్థానాల్లో టీడీపీ, 24 స్థానాల్లో జనసేన అభ్యర్థులను ప్రకటించాయి.
Read Also: Petrol Diesel Prices : ముడి చమురు ధరలో భారీ పతనం.. త్వరలో తగ్గనున్న పెట్రోల్ ధరలు
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
కాగా, గత కొద్ది రోజులుగా టీడీపీ- జనసేన పార్టీలు అభ్యర్థులపై కసరత్తులు చేస్తున్నాయి. ఇక, నియోజకవర్గాల్లో గెలిచే సత్తా ఉన్న అభ్యర్థుల జాబితాను చంద్రబాబు రూపొందించారు. ముఖ్యమైన నేతలతో చర్చించిన తర్వాత ఈ జాబితాను ఆయన రిలీజ్ చేశారు. కొన్ని నియోజకవర్గాల్లో కుటుంబాలకు సంబంధించిన టిక్కెట్ల వ్యవహారం కూడా అక్కడి నేతలతో ప్రధానంగా చర్చించారు. పొత్తులతో ఎన్నికలకు వెళ్తున్నందున ఈసారి సర్దుకుపోవాలని వారికి చంద్రబాబు సూచించారు. అందుకు చాలా మంది నేతలు ఓకే చెప్పినట్లు టాక్. మరికొందరిని మాత్రం తప్పని పరిస్థితుల్లో పక్కకు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పాడిందన్నారు. వైసీపీ నుంచి వచ్చి కొత్తగా పార్టీలో చేరిన వారికి కూడా కొందరికి ఎమ్మెల్యేగా అవకాశం కల్పించినట్లు చంద్రబాబు పేర్కొన్నారు.
Read Also: TDP-Janasena First List: టీడీపీ-జనసేన ఉమ్మడి తొలి జాబితా విడుదల
ఇక, జనసేన ఆశించే స్థానాల్లో ఉన్న టీడీపీ నేతలకు కొందరికి ప్రత్యామ్నాయ నియోజకవర్గాలు సూచించారు. మరి కొందరికి మాత్రం అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవులు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. పొత్తుల్లో భాగంగా కొన్ని సీట్లను త్యాగాలు చేయాల్సిన అవసరం ఉందని మొదటి నుంచి ఆయన చెప్పుకుంటూ వచ్చారు.. రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో కొన్ని స్థానాలకు మాత్రం ఫస్ట్ లిస్ట్‌లో అవకాశం లభించింది.
Read Also: US Road Accident: కాలిఫోర్నియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది మృతి
అయితే, పొత్తులో భాగంగా సీట్లు కోల్పోయిన వారికి అధికారంలోకి రాగానే నామినేటెడ్ పదవులు ఇస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడించారు. జగన్ ను ఓడించడమే ప్రస్తుతం అందరి ముందున్న కర్తవ్యమన్నారు. అందులో భాగంగా అందరూ సహకరించాలి.. పార్టీ విజయానికి కృషి చేయాలని ఆయన కోరారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అందరినీ సముచితమైన స్థానం దక్కుతుందన్నారు. మనందరిది ఒకటే లక్ష్యం.. వైసీపీని ఓడించడమే.. అందరూ సమన్వయంతో కలిసి పార్టీ విజయానికి కృషి చేయాలని చంద్రబాబు- పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!