జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ-జనసేన తొలి జాబితాపై సెటైర్లు వేశారు. జనసేన 24 సీట్లకే పరిమితమైందంటే పవన్ సామర్థ్యం అర్థం చేసుకోవచ్చని ఎద్దేవా చేశారు. వాళ్లు అమిత్‌షాను కలిసినా, అమితాబ్ బచ్చన్‌ను కలిసినా వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందన్నారు.
టీడీపీ- జనసేన పొత్తులో టిక్కెట్ల కేటాయింపుపై రాజమండ్రిలో రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ- జనసేన పార్టీలో సీట్ల ప్రకటన తర్వాత డొల్లతనం బయటపడిందని ఆరోపించారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై హరిరామజోగయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్‌కల్యాణ్‌కు హరిరామజోగయ్య లేఖ రాశారు. జనసేనకు 24 సీట్లకు మించి గెలిచే సత్తా లేదా అంటూ తీవ్రంగా మండిపడ్డారు.. ఒకరు ఇవ్వడం, మరొకరు దేహీ అనడం పొత్తుధర్మం అనిపించుకుంటుందా.. జనసేన పరిస్థితి ఇంత హీనంగా ఉందా అంటూ వ్యాఖ్యానించారు.
ఎన్నికలకు సన్నద్ధం అవుతోన్న టీడీపీ - జనసేన.. ఉమ్మండిగా తొలి జాబితాను ప్రకటించాయి.. అయితే, అభ్యర్థుల ప్రకటన తర్వాత వివిధ జిల్లాల్లో.. నియోజకవర్గాల్లో ఆయా పార్టీల శ్రేణులు రోడ్డెక్కారు. మొత్తం 99 సెగ్మెంట్లకు అభ్యర్థులను ప్రకటించింది టీడీపీ-జనసేన. కానీ.. తొమ్మిది నియోజకవర్గాల్లో అసమ్మతి సెగలు రాజుకు