Bigg boss 6: బిగ్ బాస్ సీజన్ 6 మూడోవారం ఎలిమినేషన్ కు సంబంధించిన వివరాలు ఆదివారం రాత్రి ప్రసారం కాబోతున్నాయి. అయితే గత సీజన్స్ మాదిరిగానే ఈసారి కూడా లీకు వీరులు సోషల్ మీడియాలో ఒకరోజు ముందే, మర్నాడు ఏం జరుగుతోందో ఫీలర్స్ వదులుతున్నారు. మొదటి వారం హౌస్ నుండి ఎవరినీ ఎలిమినేట్ చేయని బిగ్ బాస్… రెండో వారంలో ఏకంగా ఇద్దరిని షో నుండి బయటకు పంపాడు. షానీ, అభినయశ్రీ సెకండ్ వీక్ బయటకు రాగా… ఇప్పుడు ఆ వేటు యాంకర్ నేహా చౌదరిపై పడినట్టు సమాచారం.
ఈ వారం తొమ్మిది మందిని వారి ఆటతీరును అనుసరించి బిగ్ బాస్ నామినేట్ చేశాడు. అందులో ఆరోహి, రేవంత్, గీతూ, ఆదిత్య, ఇనయా, వాసంతి, చలాకీ చంటి, నేహా చౌదరి, శ్రీహాన్ ఉన్నారు. అయితే వీరిలో వీక్షకుల ఓట్లతో పాటు ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని బిగ్ బాస్ రేవంత్, బాలాదిత్య, శ్రీహాన్, చంటి, గీతును వివిధ దశల్లో సేఫ్ జోన్ లోకి పంపినట్టు తెలుస్తోంది. ఇక చివరికి డేంజర్ జోన్ లో ఇనయా, ఆరోహి, వాసంతి, నేహా చౌదరి నిలువగా అందులో నేహా చౌదరిని అదృష్టం వెక్కిరించింది. దాంతో బిగ్ బాస్ హౌస్ లో ఆమె ప్రయాణం మూడు వారాలతో ముగిసిపోయింది. అయితే… ఏ యే అంశాల కారణంగా నేహా చౌదరి ఎలిమినేట్ అయ్యిందనే పూర్తి వివరాలు ఈ రోజు ఎపిసోడ్ చూస్తేనే తెలుస్తుంది.
Woman Married Husband Friend: త్రిపుల్ తలాక్ చెప్పిన భర్తకు దిమ్మతిరిగే షాక్