Suryapet Horror: ఆస్తి రిజిస్ట్రేషన్ చేయలేదని తండ్రిపై కొడుకు కొపం పెంచుకున్నాడు. కన్న తండ్రిని దారికాచీ మరీ దారుణంగా హత్య చేశాడు. ఆస్తి విషయంలో కన్న కొడుకు.. కర్కోటకుడిగా మారాడు. ఈ అమానవీయ ఘటన సూర్యాపేట జిల్లాలో కలకలం రేపింది. ఆ తండ్రి.. తన ఆస్తి పంచేందుకు కొడుకుతో ఒప్పంద పత్రాలు రాసుకున్నాడు. కానీ భార్య చనిపోవడం.. ఇతరత్రా కారణాల దృష్ట్యా తండ్రి తన కొడుకు పేరిట భూమిని రిజిస్ట్రేషన్ చేయించడం కాస్తా ఆలస్యం అయింది.
అయితే, తండ్రి కావాలనే జాప్యం చేస్తున్నాడని కొడుకు ఆగ్రహించి తండ్రిని హత్య చేశాడు. ఈ ఘటన సూర్యపేట జిల్లా మోతే మండలం నాగయ్యగూడెంలో జరిగింది. నాగయ్యగూడెంకు చెందిన నిమ్మరబోయిన వెంకన్నకు 4.29 ఎకరాల భూమి ఉంది. వెంకన్నకు ఇద్దరు కుమారులు. ఒకరు గంగయ్య, మరోకరు ఉప్పయ్య, కూతురు స్వరూప ఉన్నారు. ఈ భూమిలో 29 గుంటల భూమి కుమార్తెకు, ఒక ఎకరం తండ్రి వెంకన్నకు మిగిలిన మూడు ఎకరాల భూమిని తన ఇద్దరు కుమారులకు చెరి సగం పంచుకునేలా నాలుగేళ్ల క్రితం పెద్దమనుషుల సమక్షంలో ఒప్పంద పత్రాలు రాసుకున్నారు.
Read Also:Son Kills Father: మనిషి కాదు.. నరరూప రాక్షసుడు! కన్నతండ్రినే కిరాతకంగా..!
ఇకపోతే, వెంకన్న తన చిన్న కుమారుడు ఉప్పయ్యతో కలిసి ఉంటున్నాడు. పెద్ద కుమారుడు గంగయ్య అదే గ్రామంలో వేరుగా నివాసం ఉంటున్నాడు. తన ఇద్దరు కొడుకులకు పంచిన తరువాత.. తన భార్య అనారొగ్యంతో ఉన్నప్పుడు అప్పులు కావడంతో.. ఆ అప్పులను తీర్చడానికి తన వాటాగా తీసుకున్న ఎకరం పొలాన్ని వెంకన్న విభలాపురం గ్రామానికి చెందిన మైనంపాటి రంగారెడ్డికి విక్రయించాడు.
అంతేకాదు, తాను విక్రయించిన ఎకరం పొలాన్ని మైనంపాటి రంగారెడ్డికి గత నెల 28వ తేదీన వెంకన్న రిజిస్ట్రేషన్ కూడా చేసాడు. అదేరోజు తన కుమార్తే స్వరూపకు వాటాగా ఇచ్చిన 29 గంటల భూమిని కూడా వెంకన్న రిజిస్ట్రేషన్ చేశాడు. ఈ విషయం పెద్ద కుమారుడికి తండ్రి చెప్పలేదు. మరుసటి రోజు రిజిస్ట్రేషన్ జరిగిన విషయం తెలుసుకున్న పెద్ద కుమారుడు గంగయ్య తన వాటా భూమి ఎకరంన్నర భూమిని కూడా తన పేరిట రిజిస్ట్రేషన్ చేయాలని పెద్ద మనుషుల ద్వారా తండ్రిని అడిగించాడు. దీంతో ఈనెల 1న రిజిస్ట్రేషన్ చేస్తానని పెద్ద కొడుకు గంగయ్యకు తండ్రి హామీ ఇచ్చాడు.
Read Also:Eng vs IND: డబుల్ సెంచరీతో చెలరేగిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్.. భారీ స్కోర్ సాధించిన భారత్..!
ఇచ్చిన హామీ ప్రకారం ఈ నెల 1న తన పేరిట భూమి రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో తండ్రి, కుమారుల మధ్య ఘర్షణ జరిగింది. తన వాటా భూమి తనకు ఇప్పించి న్యాయం చేయాలని పెద్ద కుమారుడు గంగయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకోవాలని పోలీసులు గంగయ్యకు సూచించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే తండ్రి వెంకన్న మోతేకు బైక్ పై వెళ్లి.. విభలాపురం తిరిగివస్తుండగా ఆయన పెద్ద కుమారుడు గంగయ్య… విభలాపురం శివారు వాగు వద్ద గొడ్డలితో తండ్రి తలపై వెనకనుంచి దాడి చేశాడు. తండ్రి బైక్ మీద నుంచి కింద పడటంతో గంగయ్య పరారయ్యడు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వెంకన్నను అంబులెన్స్ లో సూర్యాపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వెంకన్న మృతి చెందాడు. దీంతో ఆ కుటుంబంలో విషాదచాయలు నెలకొన్నాయి.
తండ్రి కొడుకుల మధ్య గత కొద్ది నెలలుగా భూవివాదం నడుస్తోంది. పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయితీ కూడా చేయగా.. తాజాగా ఆ గొడవలు సద్దుమణిగాయి అనుకున్న క్రమంలోనే ఈఘటన జరగడం గ్రామంలో కలకలం రేపింది. రెండు నెలల క్రితమే వెంకన్న భార్య మీనమ్మ అనారొగ్యంతో చికిత్స పొందుతూ చనిపోయింది. తాజాగా వెంకన్న పెద్ద కొడుకు చేతిలో దారుణ హత్యకు గుయ్యాడు. వెంకన్న కుమార్తె స్వరూప ఫిర్యాదు మేరకు గంగయ్య పై హత్యయత్నం కేసు నమోదు చేశారు మోతే పోలీసులు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ పికేట్ ఏర్పాటు చేశారు.