Sanatana Remarks: శరద్ పవార్ ఎన్సీపీ ఎమ్మెల్యే జితేంద్ర అవాద్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ‘‘సనాతన ధర్మాన్ని’’ గురించి ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై బీజేపీ మండిపడుతోంది. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ సంబిత్ పాత్ర ఆదివారం ‘‘కాంగ్రెస్ ఎకో సిస్టమ్’’ పై విమర్శలు గుప్పించారు. సనాతన ధర్మాన్ని కించపరచాలని, హిందూ ఉగ్రవాదం వంటి పదాలను ఉపయోగించాలని జితేంద్ర అవద్ నిర్ణయించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న తీరును భారత్ ఎండగట్టనుంది. ఉగ్రవాదాన్ని మన దేశంపైకి ఎగదోస్తున్న తీరును ప్రపంచ దేశాల దృష్టికి తీసుకెళ్లనుంది. ఇప్పటికే పహల్గాం ఘాతుకాన్ని అన్ని రాజకీయ పార్టీలు ముక్తకంఠంతో ఖండించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా పాకిస్థాన్‌పై భారత్ దౌత్య యుద్ధం చేయాలని నిర్ణయించింది. ప్రపంచ దేశాలకు అఖిలపక్ష ప్రతినిధి బృందాలు వెళ్లనున్నాయి.. మోడీ సర్కార్ ఏడు డెలిగేషన్స్‌ను ఏర్పాటు చేసింది. అమెరికా వెళ్లే ప్రతినిధి బృందానికి శశిథరూర్ నేతృత్వం వహించనున్నారు.
ఎయిరిండియా తీరుపై దేశ వ్యాప్తంగా ప్రముఖుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆ మధ్య కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్.. ఎయిరిండియా సర్వీస్‌పై సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తిపోశారు. తనకు విరిగిపోయిన సీటు ఇచ్చారంటూ మండిపడ్డారు.
Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌పై విపక్ష నేతలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. బీజేపీ అంటేనే కోపంతో రగిలిపోయే శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్ ఇటీవల ఫడ్నవీస్‌పై ప్రశంసలు కురిపించారు. గడ్చిరోలి జిల్లాలో సీఎం సమక్షంలో 11 మంది నక్సలైట్లు లొంగిపోయారు. శివసేన పత్రిక సామ్నాలో ఫడ్నవీస్ కృషిని పొగిడారు.
Bitcoin Scam: మహారాష్ట్ర ఎన్నికల సమయంలో ‘‘బిట్‌కాయిన్ స్కాం’’ సంచలనంగా మారింది. ఎన్సీపీ ఎంపీ, శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే, మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలేపై రిటైర్డ్ ఐపీపీఎస్ అధికారి సంచలన ఆరోపణలు చేశారు. ఈ స్కాంలో ఆడిటింగ్ సంస్థకు చెందిన ఉద్యోగికి సీబీఐ సమన్లు జారీ చేసింది.
Supriya Sule: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఎన్సీపీ (ఎస్పీ) నేత సుప్రియా సూలే ఓటేసింది. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. తాను అక్రమ బిట్‌కాయిన్ లావాదేవీలకు పాల్పడినట్లు బీజేపీ చేస్తున్న ఆరోపణలను తప్పుబట్టింది.
Supriya Sule: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) పగ్గాలు తన కజిన్ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌కు ఇచ్చేందుకు పార్టీ సిద్ధమైనప్పటికీ ఆయన తమను వీడి వెళ్లారని ఎంపీ సుప్రీయా సూలే అన్నారు.
Ajit Pawar: రాజకీయాలను ఇళ్లలోకి రానీవ్వకూడదని మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ అన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో తన సోదరి సుప్రియా సూలేకి వ్యతిరేకంగా తన భార్య సునేత్రా పవార్‌ని పోటీకి దింపడం ద్వారా తప్పు చేశానని అన్నారు.
Loksabha Elections 2024 : దేశంలో ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో ఇప్పటి వరకు రెండు దశల్లో ఓటింగ్ జరిగింది. ఆ తర్వాత మే 7న మూడో దశ పోలింగ్ జరగనుంది.