Subramanian Swamy: తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి. తాజాగా ఏకంగా ప్రధాని నరేంద్రమోడీ, హోంమంత్రి అమిత్ షాలపై సంచలన వ్యాఖ్యలు చేయడంతో అందరూ ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. గుజరాత్ మాజీ హోంమంత్రి హరేన్ పాండ్య హత్యోదాంతాన్ని ప్రస్తావిస్తూ ప్రధాని, అమిత్ షాలపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ మేరకు సుబ్రహ్మణ్యస్వామి ట్వీట్ చేశారు. 2003మార్చి 26న గుజరాత్ మాజీ హోం మంత్రి హరేన్ పాండ్యా మాదికిగా తనపై మోడీ, అమిత్ షా కుట్ర చేయబోరని భావిస్తున్నానని సుబ్రహ్మణ్య స్వామి పేర్కొన్నారు. అలా అయితే తాను తన స్నేహితులను అప్పమత్ం చేయాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు.
Read Also: Little Man Marriage: పొట్టి మనిషికి పెళ్లి.. ప్రధాని, సీఎంలే చీఫ్ గెస్టులు ?
2002లో గోద్రా అల్లర్లు జరిగిన తర్వాత క్యాబినెట్ సమావేశంలో చర్చి జరిగింది. ఈ అల్లర్లకు బలైన బాధితుల మృతదేహాలను అహ్మదాబాదుకు తీసుకురావడానికి పాండ్యా వ్యతిరేకించారు. ఎందుకంటూ అది ఉద్రిక్తతలకు దారి తీస్తుందని పాండ్య అభిప్రాయం. 2003లో హరేన్ పాండ్యా అహ్మదాబాద్ లో హత్యకు గురయ్యారు. మార్నింగ్ వాక్ కు వెళ్లిన ఆయన కారులో కూర్చుని ఉండగా, ఇద్దరు దుండగులు కాల్పులు జరిపారు. ఐదు బుల్లెట్లు తాకడంతో ఆయన కారులోనే ప్రాణాలు విడిచారు. దాదాపు రెండు గంటల పాటు ఆయన మృతదేహం కారులోనే ఉంది.