Little Man Marriage: పెళ్లి చేసుకోవాలని చాలా సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నాడు. పెళ్లి సంబంధం కోసం చేయని ప్రయత్నమంటూ లేదు. పెళ్లి కూతురు కోసం తెలిసిన చోటల్లా ఆరా తీశాడు. అడగాల్సిన వారందరినీ అడిగాడు. అయినా వివాహం కాలేదని ఆందోళనకు గురయ్యాడు. అతడి పెళ్లికి ప్రధాన ఆటంకం ఎత్తు. కేవలం 2.3 అడుగుల ఎత్తు ఉండటంతో ఎవరూ పిల్లను ఇవ్వడానికి ఒప్పుకోలేదు. కానీ, పట్టువదలకుండా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఎట్టకేలకు అతడి నిరీక్షణ ఫలించింది. ప్రస్తుతం తన పెళ్లి కుదరడంతో మనోడు గాల్లో తేలుతున్నాడు. జీవితాంతం గుర్తిండిపోయేలా తన వివాహం జరగాలని కోరుకుంటున్నాడు యూపీలోని షామ్లి జిల్లాకు చెందిన అజీమ్ మన్సూరి.. తన పెళ్లికి ముఖ్య అతిథులుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ లను ఆహ్వానించనున్నట్లు చెబుతున్నాడు. అజీమ్ పెళ్లికి నవంబర్ 7న ముహూర్తం నిర్ణయించారు పెద్దలు.
Read Also : Canal Culvert Collapsed : గుజరాత్ బ్రిడ్జి ఘటన మరువక ముందే కూలిన మరో కల్వర్ట్
అజీమ్ తనకు వధువును చూసి పెట్టమంటూ పలువురు రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారుల చుట్టూ చెప్పులరిగేలా తిరిగానని చెబుతున్నాడు. అంతేకాదు, 2019లో యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్‌ను కలిసి, తనకు సంబంధం చూడాలని కోరానన్నాడు. నజీమ్ ఏళ్ల తరబడి ఆరాటం, పోరాటం ఎట్టకేలకు ఫలించింది. హపూర్‌కు చెందిన తన కలల రాకుమారి బుషరాను గతేడాది మార్చిలో కలుసుకున్నాడు.
Read Also: Thief Send Email: ‘సారీ బ్రో.. డబ్బుల్లేక ల్యాప్ టాప్ తీసుకెళ్తున్నా’ ఓనర్‌కు మెయిల్ చేసిన దొంగ

అజీమ్ మన్సూరి నిశ్చితార్థం ఏప్రిల్ 2021లో జరిగినా.. వధువు గ్రాడ్యుయేషన్ పూర్తయ్యే వరకూ పెళ్లిని వాయిదా వేశారు. వధువు మాత్రం అతడి కంటే కొంచెం ఎత్తే కావడం గమనార్హం. ఆమె ఎత్తు మూడడుగులు. నజీమ్ మాత్రం ఐదో తరగతి మధ్యలోనే ఆపేశాడు. షామ్లీ జిల్లాలో కాస్మెటిక్స్ దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. తన పెళ్లి కోసం ప్రత్యేకంగా షేర్వాణీ, షూట్‌ను తానే డిజైన్ చేసుకోవడం విశేషం. అజీమ్ తల్లిదండ్రులకు ఆరుగురు సంతానం కాగా.. వారిలో అజీమ్ చిన్నవాడు. పాఠశాలకు వెళ్లేటప్పుడు అందరూ తనను హేళనచేయడం, చులకగా చూడటంతో మధ్యలో బడి మానేశాడు.
Uttar Pradesh | Azeem Mansoori, a 2.3 feet tall man, in Shamli district, wants to invite PM Modi & UP CM Yogi Adityanath to his wedding as he finally ties the knot in November pic.twitter.com/quhYaUyOKx
— ANI UP/Uttarakhand (@ANINewsUP) October 29, 2022