తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో హింస జరిగిందంటూ ఏపీ హైకోర్టులో పిల్ వేసిన బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి.. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల సందర్భంగా దురదృష్టకరమైన సంఘటన జరిగింది. చాలామందిని భయపెట్టడం దాడులు చేశారు.. ఎన్నికలు జరుగుతున్న సమయంలో హింసను నివారించేందుకు తీవ్రమైన చర్యలు తీసుకోవాలని నేను పిల్ వేశాను.
Rahul Gandhi: లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై ఢిల్లీ హైకోర్టులో బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి శుక్రవారం ఓ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీ భారత పౌరసత్వాన్ని రద్దు చేసేలా హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖని ఆదేశించాలని ఆయన హైకోర్టుని ఆశ్రయించారు.
ద్వీప దేశం శ్రీలంక రగులుతోంది. మొత్తం దేశం రావణకాష్టంలా మారుతోంది. తీవ్రమైన ఆర్థిక, ఆహారం సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. పూర్తిగా చెప్పాలంటే రాజపక్సే ప్రభుత్వం శ్రీలంకను అప్పుల ఊబిలోకి నెట్టేసింది. దీంతో పాటు అక్కడ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు తీవ్ర ఆహార కొరతకు కారణం అయ్యాయి. మరోవైపు ఆర్థిక పరిస్థితికి మించి విదేశాల నుంచి ముఖ్యంగా చైనా నుంచి అప్పులు తీసుకుంది. అప్పులు చెల్లించలేక హంబన్ టోటా రేవును చైనాకు లీజుకు ఇచ్చింది. అధ్యక్షుడు గొటబయ రాజపక్సే, ప్రధాని…
కరోనా విలయం సృష్టించింది.. మరోసారి ఉగ్రరూపం దాల్చి ఎటాక్ చేస్తోంది.. ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బకొట్టింది.. సామాన్యులు జీవనమే కష్టంగా మారిపోయింది.. అయితే, ఈ సమయంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు కీలక సూచనలు చేశారు బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి.. ఏ విషయం అయినా కుండ బద్దలు కొట్టినట్టుగా.. సూటిగా మాట్లాడే ఆయన.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఈ సమయంలో మీరు ఆర్థిక మంత్రిగా ఉండి ఉంటే ఏం చేసేవారు?…
ఓవైపు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు టెన్షన్ పెడుతున్న వేళ.. వచ్చే ఏడాది యూపీ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై నీలినీడలు కమ్ముకున్నాయి… ఇప్పటికే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి సూచించిన అలహాబాద్ హైకోర్టు… ఎన్నికల ప్రచారం, ర్యాలీలు, సభలపై ప్రధాని నరేంద్ర మోడీకి కూడా సూచలను చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఎప్పుడు వాస్తవాలకు దగ్గర మాట్లాడుతూ.. కొన్ని సార్లు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే బీజేపీ రాస్యభసభ సభ్యులు…
ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో భేటీ బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి భేటీ కానున్నారు. ఈ మధ్యాహ్నం 12.30 కు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో రానున్నారు సుబ్రహ్మణ్య స్వామి. ఒంటి గంట ప్రాంతంలో తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ తో భేటీ కానున్నారు. ఆధ్యాత్మిక క్షేత్రం టీటీడీ విషయంలో సీఎం జగన్ తీసుకుంటున్న చర్యలను గతంలో ప్రసంశించారు సుబ్రహ్మణ్యం స్వామి. అయితే టీటీడీ విషయంలో జరుగుతున్న అసత్య ప్రచారాలపై గతంలో కోర్టులో పిటిషన్ దాఖలు…