భాలీవుడ్‌లో చిత్రమైన సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్నాడు మాలీవుడ్ స్టార్ హీరో పృథ్వీరాజ్. యంగ్ బ్యూటీలతో రొమాన్స్ చేస్తే కిక్కేముంటుందని అనుకుంటున్నాడో లేక.. ఆఫర్లే అలా వస్తున్నాయో తెలియదు. పృధ్వీరాజ్ సుకుమారన్ బీటౌన్‌లో తన్న కన్నా ఏజ్ ఏక్కువున్న భామలతో రొమాన్స్ చేస్తున్నాడు. నార్త్ బెల్ట్‌లో కెరీర్ స్టార్టింగ్ నుండి ఇలాంటి డెసిషన్సే తీసుకున్నాడు. అయ్యాలో తన కన్నా ఐదేళ్లు పెద్దదైన రాణిముఖర్జీతో రొమాన్స్ చేశాడు వరదాజ మన్నార్. మొన్న కాజోల్ దేవగన్ సరసన సర్ జమీన్‌లో కనిపించాడు.
Also Read : MEGA 157 : చిరు అనిల్ టైటిల్ గ్లిమ్స్ రిలీజ్ ఈవెంట్ ఎక్కడంటే?
సర్ జమీన్‌లో కాజోల్ భర్తగా, ఓ కొడుకుకు తండ్రిగా కనిపించాడు పృధ్వీరాజ్ సుకుమారన్. ఇక్కడితో ఆగితే వర్సటైల్ యాక్టర్ ఎందుకవుతాడు. నెక్ట్స్ కూడా సీనియర్ భామతోనే రొమాన్స్ చేయబోతున్నాడు ఈ మాలీవుడ్ హీరో. తన కన్నా రెండేళ్లు పెద్దదైన కరీనా కపూర్‌తో కలిసి దైరాలో నటిస్తున్నాడు. రీసెంట్లీ ఓ ఇంటర్వ్యూలో కన్ఫర్మ్ చేశాడు పృధ్వీ. మేఘన గుల్జార్ దర్శకత్వంలో వస్తోన్న ఫిల్మ్ దాయ్రా ఈ మూవీలో కరీనా కపూర్, పృధ్వీ జంటగా నటిస్తున్నారు. స్క్రిప్ట్ నచ్చే ఓకే చేసినట్లు చెప్పుకొచ్చాడు పృథ్వీ రాజ్. త్వరలో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుందట. ఈ లెక్కన చూస్తే జస్ట్ స్టోరీనే నమ్ముతున్న పృధ్వీ తన సీనియర్ భామలతో స్క్రీన్ షేర్ చేసుకోవడాన్ని సింపుల్‌గా తీసుకుంటున్నాడు. ఇక పృధ్వీ సొంత ఇలాకాలో కన్నా ఇతర ఇండస్ట్రీలలోనే ఎక్కువగా హల్చల్ చేస్తున్నాడు. గతంలో మలయాళ ఇండస్ట్రీతో పాటు అడపా దడపా తెలుగు, తమిళ, హిందీ చిత్రాలలో జస్ట్ గెస్టుగా వచ్చి వెళ్లిపోయేవాడు. కానీఇప్పుడు మల్లూవుడ్‌కే గెస్టుగా మారేట్లు కనిపిస్తున్నాడు. ప్రస్తుతం తెలుగులో రాజమౌళి- మహేష్ మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఒక వేళ ప్రియాంకతో పృధ్వీ పెయిర్ ఫిక్స్ అయితే మరోసారి తనకన్నా ఎక్కువ ఏజ్డ్ హీరోయిన్‌తో జోడీ కట్టినట్లే.