ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నారా? అయితే ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలను మిస్ చేసుకోకండి. తాజాగా నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (NCRTC) వివిధ పోస్టుల భర్తీకోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 71 ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీకానున్న పోస్టుల్లో జూనియర్ ఇంజనీర్, ప్రోగ్రామింగ్ అసోసియేట్, అసిస్టెంట్ వంటి పోస్టులున్నాయి. అభ్యర్థులు పోస్టులను అనుసరించి డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ పాసై ఉండాలి.
Also Read:Train Incident: ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన కామాఖ్య ఎక్స్‌ప్రెస్!
అభ్యర్థులు 18 నుంచి 25 ఏళ్ల వయసు కలిగి ఉండాలి. సీబీటీ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) రూ.22,800 నుంచి రూ.75,850, జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రానిక్స్) రూ.22,800 నుంచి రూ.75,850 (NE5), జూనియర్ ఇంజనీర్ (మెకానికల్) రూ.22,800 నుంచి రూ.75,850, జూనియర్ ఇంజనీర్ (సివిల్) రూ.22,800 నుంచి రూ.75,850, ప్రోగ్రామింగ్ అసోసియేట్ రూ.22,800 నుంచి రూ.75,850, అసిస్టెంట్ (హెచ్ఆర్) రూ.20,250 నుంచి రూ.65,500, అసిస్టెంట్ (కార్పొరేట్ హాస్పిటాలిటీ) రూ.20,250 నుంచి రూ.65,500, జూనియర్ మెయింటెనర్ (ఎలక్ట్రికల్) రూ.18,250 నుంచి రూ.59,200, జూనియర్ మెయింటెనర్ (మెకానికల్) రూ.18,250 నుంచి రూ.59,200 జీతం ఉంటుంది.
Also Read:Jagga Reddy: నా రాజకీయ జీవిత కథను నేనే రాసుకున్న..
ఉద్యోగులు చేరిన తర్వాత రెండేళ్ల ప్రొబేషన్ వ్యవధిని పూర్తి చేయాలి. జనరల్, OBC, EWS, మాజీ సైనికుల వర్గాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు ఫీజు రూ. 1000 చెల్లించాలి. SC, ST, PwBD వారికి ఫీజు నుంచి మినహాయింపునిచ్చారు. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఏప్రిల్ 24 వరకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.