Hero Karizma XMR 250: ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన హీరో మోటోకార్ప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అబ్బురపరిచే డిజైన్, మన్నికైన నిర్మాణం, అందుబాటు ధరలో ఉండే బైకులను తయారు చేస్తోంది హీరో మోటోకార్ప్. మరికొద్ది రోజుల్లో హీరో కరిజ్మా XMR 250 పేరుతో కొత్త మోటార్ సైకిల్ ను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. స్పోర్టీ లుక్, శక్తివంతమైన ఇంజిన్, ఆకర్షణీయమైన రంగుల ఎంపికలతో ఈ బైక్ యూత్‌కు మరింత నచ్చేలా రూపొందించబడినాట్లు సమాచారం.
హీరో మోటోకార్ప్ ప్రకారం, ఈ బైక్ యువతను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడింది. కావాసాకి నింజా తరహాలో ఈ బైక్ అగ్రెసివ్ డిజైన్‌తో వస్తోంది. కరిజ్మా XMR 250 బాడీ మరింత మస్కులర్‌గా ఉండి, పెద్ద విండ్షీల్డ్, హెడ్ లైట్ క్రింద వింగ్ లెట్లతో పూర్తి మంచి లుక్‌ను కలిగి ఉంటుంది. ఈ బైక్‌లో అధునాతన ఫీచర్లు కూడా అందించబడ్డాయి. ఇది రైడింగ్ అనుభూతిని మరింత మెరుగుపరిచేలా రూపొందించబడింది. ఇందులో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ ఉండి, పూర్తి డిజిటల్ స్పీడోమీటర్‌ను అందిస్తుంది.
ఈ బైక్ లో బ్లూటూత్ కనెక్టివిటీ ద్వారా స్మార్ట్‌ఫోన్‌ను బైక్‌తో అనుసంధానించుకోవచ్చు. USB ఛార్జింగ్ పోర్ట్ సౌలభ్యంతో రైడ్ సమయంలో మొబైల్ ఛార్జింగ్ కూడా చేయవచ్చు. నావిగేషన్ సిస్టమ్ అందుబాటులో ఉండటంతో, ప్రయాణించే మార్గాన్ని సులభంగా తెలుసుకోవచ్చు. రైడింగ్‌ను మరింత సురక్షితంగా మార్చేందుకు ట్రాక్షన్ కంట్రోల్ వ్యవస్థను కూడా అందించారు. అలాగే ఇందులో LED హెడ్‌లైట్లు మరింత శక్తివంతమైన, స్పష్టమైన వెలుతురును అందించి రాత్రి వేళల్లో కూడా ఉత్తమ దృశ్యాన్ని కలిగి ఉండేలా చేస్తాయి.
Read Also: Realme P3 Ultra 5G: 6.83 అంగుళాల డిస్ ప్లే, 6000mAh బ్యాటరీ ఫోన్ రూ.3000 తగ్గింపుతో సేల్ ప్రారంభం
ఈ హీరో కరిజ్మా XMR 250 లో 250cc లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ అమర్చబడి ఉంటుంది. ఇది 30PS పవర్, 25Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అత్యుత్తమ ఇంజిన్ పెర్ఫార్మెన్స్ కోసం, 6-స్పీడ్ గేర్‌బాక్స్ తో BS6 ప్రమాణాలకి అనుగుణంగా రూపొందించబడింది. కంపెనీ ప్రకారం టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఈ బైక్ గరిష్టంగా 150 km/h వేగంతో నడిచే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇది స్పోర్ట్స్ బైక్ ప్రేమికుల కోసం బాగా ఆకర్షించే అంశం. హీరో కరిజ్మా XMR 250 ప్రారంభ ధర రూ. 2 లక్షలు (ఎక్స్-షోరూం) గా ఉంటుందని అంచనా. టాప్ వేరియంట్ ధర రూ. 2.20 లక్షల వరకు ఉండే అవకాశం కూడా లేకపోలేదు. ఈ బైక్‌కు కొన్ని అదనపు యాక్సెసరీస్ కూడా అందుబాటులో ఉంచే అవకాశం కూడా ఉంది. అయితే ఈ హీరో కరిజ్మా XMR 250 బైక్‌ను మార్కెట్లోకి తీసుకొస్తుంది ఇంకా తెలపలేదు.