Sourav Ganguly on Rohit Sharma: టీ20 ప్రపంచకప్ 2021లో భారత్ గ్రూప్ దశ నుంచే నిష్క్రమించిన తర్వాత విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా వైదొలిన విషయం తెలిసిందే. విరాట్ స్థానంలో రోహిత్ శర్మ భారత జట్టు పగ్గాలు అందుకున్నాడు. రోహిత్‌ను కెప్టెన్‌గా నియమించిన సమయంలో బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న సౌరవ్ గంగూలీని అందరూ విమర్శించారు. కెప్టెన్‌ను మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది?, రోహిత్ ఐసీసీ ట్రోఫీ సాధిస్తాడా?, గంగూలీ నిర్ణయం సరైంది కాదు? అని దాదాపై విమర్శలు వచ్చాయి. అయితే రోహిత్ సారథ్యంలో భారత్ టీ20 ప్రపంచప్ విశ్వవిజేతగా నిలిచింది. ఈ నేపథ్యంలో గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
టీ20 ప్రపంచప్ 2024 ట్రోఫీని టీమిండియా గెలవడంతో దేశమంతా సంబరాలు చేసుకున్నారని, రోహిత్ శర్మను కెప్టెన్‌గా చేసిన తనను మాత్రం అందరూ మర్చిపోయారని సౌరవ్ గంగూలీ అన్నారు. ‘రోహిత్ శర్మకు టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు అప్పగించినప్పుడు అందరూ నన్ను విమర్శించారు. ఇప్పుడు రోహిత్ సారథ్యంలోనే భారత జట్టు టీ20 ప్రపంచకప్ సాధించింది. దీంతో అందరూ నన్ను విమర్శించడం మానేశారు. ఆ విషయాన్ని మరచిపోయారు అని అనుకుంటున్నా. రోహిత్‌ను కెప్టెన్‌గా నియమించింది నేనే’ అని దాదా పేర్కొన్నారు.
Also Read: Anant Ambani Wedding: స్నేహితులకు 2 కోట్ల వాచ్.. అంబానీతో అట్లుంటది మరి!
ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టుకు ఐదు ట్రోఫీలు అందించిన రోహిత్ శర్మపై బీసీసీఐ నమ్మకముంచింది. కెప్టెన్‌గా అవకాశం ఇచ్చింది. రోహిత్ సారథ్యంలో భారత్ పలు సిరీస్‌లు గెలవడంతో పాటు 2023 డబ్ల్యూటీసీ ఫైనల్, 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్ వరకు వెళ్లింది. ఆ టోర్నీల్లో ఫైనల్ మెట్టుపై బోల్తాపడిన భారత్.. 2024 టీ20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. 11 ఏళ్ల తర్వాత భారత్ ఐసీసీ ట్రోఫీ గెలవడంతో దేశమంతా సంబరాలు చేసుకుంది.