Sourav Ganguly on Rohit Sharma: టీ20 ప్రపంచకప్ 2021లో భారత్ గ్రూప్ దశ నుంచే నిష్క్రమించిన తర్వాత విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా వైదొలిన విషయం తెలిసిందే. విరాట్ స్థానంలో రోహిత్ శర్మ భారత జట్టు పగ్గాలు అందుకున్నాడు. రోహిత్‌ను కెప్టెన్‌గా నియమించిన సమయంలో బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న సౌరవ్ గంగూలీని అందరూ విమర్శించారు. కెప్టెన్‌ను మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది?, రోహిత్ ఐసీసీ ట్రోఫీ సాధిస్తాడా?, గంగూలీ నిర్ణయం సరైంది కాదు? అని దాదాపై విమర్శలు వచ్చాయి.…