తెలుగు స్టార్ నటి, స్నేహ గురించి మనందరికి తెలిసిందే. తెలుగులో స్నేహ ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు ను సంపాదించింది.ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉండగా వయసుకు తగ్గ పాత్రలలో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. మొదట తొలివలపు అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైన స్నేహ ఆ తరువాత ప్రియమైన నీకు శ్రీరామదాసు సంక్రాంతి, సన్నాఫ్ సత్యమూర్తి వంటి పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు ను సాధించింది..
అంతేకాకుండా తమిళ మరియు మలయాళ భాషలలో కూడా నటించి అక్కడ కూడా మంచి పేరు ను సంపాదించుకుంది. ఈమె నటుడు ప్రసన్నని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఒక పాప మరియు ఒక బాబు కూడా ఉన్నారు. ఇది ఇలా ఉంటే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన వ్యక్తిగత విషయాల గురించి చెప్పుకొచ్చింది.. తన తల్లిదండ్రులకు నలుగురు కూతుళ్లు మరియు ఇద్దరు కొడుకులని, కూతుర్లలో తాను చివరి దానినని, తనకు బదులు కొడుకు పుట్టాలని తన బామ్మ గట్టిగా కోరుకుందని దీంతో ఆమె తన ముఖాన్ని చూడటానికి మూడు రోజుల వరకు ఇష్టపడలేదని చెప్పుకొచ్చింది స్నేహా. ఇక చిన్నతనంలో మంచి నీళ్లు పక్కనే ఉన్నా వాటిని సోదరులకు తామే అందించాల్సి వచ్చేదని, అదేమని ప్రశ్నిస్తే మేం మగాళ్లం. ఆడపిల్లలైన మీరే ఇంటి పనులు చేయాలని కండీషన్లు కూడా పెట్టేవారని చెప్పుకొచ్చింది. ముఖ్యంగా తన పెద్ద సోదరుడు తనను బాగా ఇబ్బందులు పెట్టేవాడని, అన్ని పనులు తననే చేయమని కూడా ఆదేశించేవాడు అంటూ తన బాధను పంచుకుంది స్నేహ. ఇకపోతే ప్రస్తుతం తాను కొన్ని సినిమాలలో నటిస్తూనే తన భర్తతో కలిసి పలు రకాల కమర్షియల్ యాడ్స్ లో కూడా నటిస్తుంది.