ప్రపంచకప్ 2023లో భాగంగా కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో బంగ్లాదేశ్- నెదర్లాండ్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ ముందు నెదర్లాండ్స్ స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. నిర్ణీత 50 ఓవర్లలో నెదర్లాండ్ 229 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ ముందు 230 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ముందుగా టాస్ గెలిచిన నెదర్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో కూడా కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ (68) పరుగులతో రాణించాడు. దీంతో విన్నింగ్ స్కోరును చేయగలిగింది నెదర్లాండ్. ఎప్పటిలాగానే టాప్ ఆర్డర్లు విఫలం కాగా.. వెస్లీ బరేసి (41) పరుగులు చేశాడు. ఓపెనర్ విక్రమ్‌జిత్ సింగ్ రెండో ఓవర్‌లోనే 3 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఆ తర్వాతి ఓవర్ లోనే రెండో ఓపెనర్ మాక్స్ ఓడౌడ్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ బాట పట్టాడు.
Read Also: Gidugu Rudra Raju: అధికార, ప్రతిపక్ష నేతల మధ్య దాయాదుల పోరు కొనసాగుతోంది..
ఇక ఆ తర్వాత ఆరో వికెట్‌కు సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్, కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ 105 బంతుల్లో 78 పరుగులు చేసి ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు. ఆ తర్వాత సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్ 35 పరుగులు, షహరిజ్ అహ్మద్ 06, ఆర్యన్ దత్ 09 పరుగులు చేశారు. ఇక బంగ్లాదేశ్ తరఫున షోరిఫుల్ ఇస్లాం, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహమాన్, మెహదీ హసన్ తలో 2 వికెట్లు తీశారు. దీంతో పాటు కెప్టెన్ షకీబ్ హసన్ ఒక వికెట్ సాధించాడు.
Read Also: Uttar Pradesh: దసరా ఉత్సవాలు చూసేందుకు వచ్చిన బాలిక కిడ్నాప్, గ్యాంగ్ రేప్