Uttar Pradesh: దేశంలో ఎక్కడో చోట ప్రతీ రోజు అత్యాచార ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. పోక్సో, నిర్భయ వంటి కఠిన అత్యాచార చట్టాలు ఉన్నా కామాంధులు, మహిళల పట్ల అకృత్యాలకు పాల్పడుతూనే ఉన్నారు. రెండు రోజుల క్రితం ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.
గురువారం ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్ లోని 15 ఏళ్ల మైనర్ బాలిక దసరా ఉత్సవాలు చూసేందుకు తన ఇద్దరు సోదరులతో కలిసి వెళ్లింది. ఆమె ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో బైక్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమెను కిడ్నాప్ చేసి, నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
Read Also: PF Balance: UAN నంబర్ లేకుండానే PF బ్యాలెన్స్‌ని తనిఖీ చేయవచ్చు.. ఎలాగో తెలుసుకోండి..
బాలిక ప్రాణపాయ స్థితిలోకి వెళ్లడంతో అక్కడే వదిలేసి పరారయ్యారు. బాలిక మేనమామ బాలికను గుర్తించి బాధిత బాలిక తల్లికి సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై ఇద్దరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అత్యాచారం కేసు నమోదు చేసేందుకు పోలీసులు నిరాకరించారని, ఈవ్ టీజింగ్ కేసు నమోదు చేశారని పోలీసులపై ఆరోపణలు చేశారు.
అయితే అత్యాచారం గురించి తెలిస్తే బాలికను ఎవరూ పెళ్లి చేసుకోరని పోలీసులు చెప్పారని, నిందితులు కూడా మైనర్లే కావడంతో మూడు నెలల్లో విడుదల అవుతారని బాలికతో పోలీసులు చెప్పినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. పోలీసులు ఈ ఆరోపణల్ని ఖండించారు. బాలిక మెడికల్ రిపోర్టుల గురించి చూస్తున్నామని, దీని తర్వాత పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని తెలిపారు.