Suryakumar Yadav and Rinku Singh Bowling Videos: శ్రీలంకపై భారత్ మూడు టీ20ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. మంగళవారం పల్లెకెలె వేదికగా లంకతో ఉత్కంఠభరితంగా ముగిసిన చివరి టీ20లో భారత్ సూపర్ ఓవర్లో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 9 వికెట్లకు 137 పరుగులే చేసింది. శుభ్‌మన్ గిల్ (39; 37 బంతుల్లో 3×4) టాప్ స్కోరర్. ఛేదనలో 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయిన లంక సరిగ్గా 137 పరుగులే చేయడంతో మ్యాచ్ టై అయింది. సూపర్ ఓవర్లో లంక 2 పరుగులే చేయగా.. సూర్య తొలి బంతికే ఫోర్ కొట్టడంతో భారత్ విజయం సాధించింది.
అయితే ఈ మ్యాచ్ ఛేదనలో 15 ఓవర్లకు శ్రీలంక ఒక వికెట్ నష్టానికి 108 రన్స్ చేసింది. ఈ స్థితిలో లంక కొడుతుందని, భారత్ గెలుస్తుందని ఎవరైనా అనుకుని ఉంటారా?. పార్ట్‌టైమ్ స్పిన్నర్లయిన రింకూ సింగ్ (2/3), సూర్యకుమార్ యాదవ్ (2/5) సంచలన బౌలింగ్‌తో లంకకు కళ్లెం వేశారు. అనూహ్యంగా బంతి అందుకున్న రింకూ 19వ ఓవర్లో 3 పరుగులే ఇచ్చి కుశాల్ పెరీరా (46), రమేశ్ (3)లను ఔట్ చేశాడు.
Also Read: Realme 13 Pro Series: ఏఐ కెమెరా ఫీచర్‌తో రియల్‌మీస్మార్ట్‌ఫోన్స్.. ధర, బ్యాటరీ డీటెయిల్స్ ఇవే!
ఆశ్చర్యకరంగా 20వ ఓవర్ వేసిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. కమిందు (1), తీక్షణ (0)లను ఔట్ చేశాడు. చివరి ఓవర్లో సూర్య 5 పరుగులే ఇవ్వడంతో మ్యాచ్ టై అయింది. అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్న రింకూ, సూర్యలపై ప్రశంసల వర్షం కురుస్తోంది. రింకూ, సూర్యలకు సంబదించిన ఓవర్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వీడియోలకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. ఆలస్యం ఎందుకు మీరూ చూసేయండి.
SURYAKUMAR BOWLING THE 20TH OVER 🤯
– What a move by the Captain…!!!!! pic.twitter.com/qLD6d58JKP
— Johns. (@CricCrazyJohns) July 30, 2024
RINKU SINGH, THE STAR IN THE 19TH OVER. 🔥 pic.twitter.com/eDv1Qt3uYj
— Johns. (@CricCrazyJohns) July 30, 2024