Realme 13 Pro Series Launch and Price in India: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ ‘రియల్‌మీ’ రెండు 5జీ స్మార్ట్‌ఫోన్‌లను భారత మార్కెట్లో విడుదల చేసింది. 13 సిరీస్‌లో భాగంగా మంగళవారం (జూలై 30) రియల్‌మీ 13 ప్రో, రియల్‌మీ 13 ప్రో ప్లస్ ఫోన్‌లను లాంచ్ చేసింది. ఎప్పటిలానే ఫోటోగ్రఫీ మరియు డిజైన్‌పై రియల్‌మీ ఎక్కువగా దృష్టి పెట్టింది. ఏఐ ఆడియో జూమ్, ఏఐ స్మార్ట్ రిమూవల్ వంటి కెమెరా ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 ప్రాసెసర్‌తో ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు వచ్చాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌ల ధర, స్పెసిఫికేషన్‌ల వివరాలను చూద్దాం.
Realme 13 Pro Plus Specs:
రియల్‌మీ 13 ప్రో ప్లస్‌లో 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ కర్వ్‌డ్ అమోలెడ్ డిస్‌ప్లే ఉంది. 120Hz రిఫ్రెష్ రేటుతో వస్తోన్న ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 ప్రాసెసర్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత రియల్‌మీ యూఐ 5.0తో ఇది పని చేస్తుంది. వెనుకవైపు 50 ఎంపీ 1/1.56 అంగుళాల సోనీ ఎల్‌వైటీ-701 సెన్సర్, 50 ఎంపీ సోనీ ఎల్‌వైటీ-600 పెరిస్కోప్ టెలిఫొటో, 8 ఎంపీ అల్ట్రా వైల్డ్ కెమెరా అమర్చారు. సెల్ఫీ కోసం 32 ఎంపీ కెమెరాను అమర్చారు. 5,200mAh బ్యాటరీతో వచ్చే రియల్‌మీ 13 ప్రో.. 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇది మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 8జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.29,999గా..12జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.31,999గా.. 12జీబీ+512జీబీ వేరియంట్ ధర రూ.33,999గా కంపెనీ నిర్ణయించింది. ఎమరాల్డ్ గ్రీన్, మోనెట్ గోల్డ్ రంగుల్లో లభిస్తుంది.
Realme 13 Pro Specs:
రియల్‌మీ 13 ప్రో ప్లస్‌లో ఉన్న డిస్‌ప్లే, ప్రాసెసర్ ఫీచర్లే రియల్‌మీ 13 ప్రోలోనూ ఉన్నాయి. వెనకాల 50 ఎంపీ ప్రధాన కెమెరా, 16 ఎంపీ అల్ట్రా వైల్డ్ కెమెరా ఉండగా.. 32 ఎంపీ సెల్ఫీ కెమెరాను ఇచ్చారు. 5,200mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ మూడు వేరియంట్లలో లభిస్తుంది. 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.23,999గా.. 8జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.25,999గా.. 12జీబీ+512జీబీ వేరియంట్ ధర రూ.28,999గా ఉంది. ఎమరాల్డ్ గ్రీన్, మోనెట్ పర్పుల్, మోనెట్ గోల్డ్ రంగుల్లో అందుబాటులో ఉంటుంది. ఆగస్టు 6 నుంచి ఈ ఫోన్స్ విక్రయాలు ఫ్లిప్‌కార్ట్‌లలో ప్రారంభమవుతాయి.