Sitara Ghattamaneni Dance for Tripping Tripping Song goes Viral: సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురిగా సితార ఘట్టమనేని గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. మహేష్ కూతురిగానే కాదు… తనకంటూ ఓ సొంత గుర్తింపు తెచ్చుకుంది సితార. ఇక సితార ఇప్పటికే జూవెలరీ యాడ్ లో నటించి మెప్పించింది. త్వరలోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందని తన తల్లి నమ్రత చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇక సితారకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ కూడా ఎక్కువే. తన ఫోటోలు, డ్యాన్సులతో నెటిజన్లకు టచ్ లోనే ఉంటుంది. తాజాగా సితార మరో డ్యాన్స్ వీడియోతో అలరించింది. మహేశ్ బాబు నటించిన ‘గుంటూరు కారం’ సినిమాలోని పాటకు సితార అదిరిపోయే స్టెప్పులు వేసింది. ‘ట్రిప్పింగ్.. ట్రిప్పింగ్’ పాటకి సితార పాప వేసిన స్టెప్పులు అదరహో అనిపిస్తున్నాయి.
Tillu Square: ‘దేవర’ ఆగమనంతోనే టిల్లు స్క్వేర్ రిలీజ్ డేట్ లింక్?
ఈ వీడియోను ఆమె తన ఇన్స్టాగ్రామ్ వేదికగా నెటిజన్లతో పంచుకుంది. సితార స్టెప్పులకు మహేశ్ బాబు ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. తండ్రికి తగ్గ తనయురాలు అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. మహేష్ బాబు కూతురు అంటే ఆ మాత్రం ఉంటుందని కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం సితార పాప డ్యాన్స్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక సితార పాప గురించి వస్తే.. ఇప్పటికే తాను క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంది. గతంలో ఆల్రెడీ సర్కార్ వారి పాట సినిమాలో ఓ పాట కోసం స్టెప్పులు వేసి పాపులర్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా గుంటూరు కారం సినిమాలోని పాటకు స్టెప్పులు వేసి.. అదరగొట్టింది లిటిల్ ప్రిన్సెస్. ఇక సితార పాప ఎప్పుడు సినిమాల్లోకి వస్తుందా అని మహేశ్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. చూడాలిమరి ఎప్పుడు వస్తుందో ఈ లిటిల్ ప్రిన్సెస్.