Tillu Square eyeing on March 30 Release Date: సిద్దు జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కిన డీజే టిల్లు సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పటికే సిద్దు జొన్నలగడ్డ కొన్ని సినిమాల్లో హీరోగా నటించాడు కానీ యూత్ మొత్తం అతని గుర్తుపెట్టుకునేలా ఈ సినిమా హిట్ అయింది. సినిమా హిట్ అయిన వెంటనే ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందని యూనిట్ ప్రకటించింది. ఇక ఆ సినిమా పేరు టిల్లు స్క్వేర్ అని కూడా కొద్ది రోజుల క్రితం క్లారిటీ వచ్చింది. అయితే ఈ సినిమా ఫిబ్రవరి 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది కానీ సంక్రాంతి బరిలో నిలిచిన సినిమా ఏదైనా తప్పుకుంటే కనుక సింగిల్ రిలీజ్ డేట్ ఇస్తామని ఫిలిం ఛాంబర్ హామీ ఇవ్వడంతో ఈ సినిమా నిర్మాత నాగ వంశీ టిల్లు స్క్వేర్ సినిమాని తొమ్మిదో తేదీ నుంచి తప్పించి ఈగల్ సినిమాకి సోలో రిలీజ్ డేట్ ఇవ్వడానికి తమకు ఎలాంటి ప్రాబ్లం లేదని క్లారిటీ ఇచ్చారు.
Supritha: కారులో ముద్దు సెల్ఫీలతో రచ్చచేస్తున్న సుప్రీత..
ఇప్పుడు ఈగల్ సినిమాకి ఎలాగూ పోటీ తప్పడం లేదు సరి కదా టిల్లు స్క్వేర్ సినిమాకి సరైన డేట్ కూడా దొరకడం లేదని తెలుస్తోంది. ఫిబ్రవరి నెల మొత్తం ఇప్పటికే దాదాపు చాలా సినిమాలు రిలీజ్ చేసేందుకు అనౌన్స్ చేశారు. ఇప్పటికి ఉన్న పర్ఫెక్ట్ డేట్ అయితే కనుక మార్చి 30 అని సినిమా టీం భావిస్తోంది. అయితే ఏప్రిల్ 5వ తేదీన జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమా రిలీజ్ కి షెడ్యూల్ అయి ఉంది. ఏదైనా డిలే జరిగి ఆ సినిమా వాయిదా వేస్తే తప్ప తమ సినిమాని మార్చి 29వ తేదీకి రిలీజ్ చేయడం కష్టమేనని టిల్లు స్క్వేర్ యూనిట్ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే దేవర టీంకి కూడా టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. తమ ఇబ్బందులు తెలియజేసి ఒకవేళ సినిమా వాయిదా పడే అవకాశం ఉంటే తమకు చెప్పాలని మార్చి 29వ తేదీన తాము ఫిక్స్ అవుతామని సందేశం పంపినట్లుగా తెలుస్తోంది. అంటే దేవర ఆగమనాన్ని బట్టి ఈ టిల్లు స్క్వేర్ సినిమా రిలీజ్ డేట్ మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ సినిమాలో సిద్దు జొన్నలగడ్డ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది.