నాణ్యమైన దిగుబడి, రైతుల ఆదాయం పెంచేందుకు నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తుల పాత్రపై ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయంలో నిర్వహించిన సదస్సులో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హజరయ్యారు. ఆయనతో పాటు.. వ్యవసాయ శాఖా కార్యదర్శి రఘునందన్ రావు, ప్రత్యేక కమీషనర్ హన్మంతు, రిజిస్ట్రార్ వెంకటరమణ, డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ రఘురాంరెడ్డి, ధనూకా చైర్మన్ ఆర్ జి అగర్వాల్, ఏసీఎఫ్ఐ ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. నాణ్యమైన ఉత్పత్తులను ఎంపిక చేసుకోవాలన్నారు. వ్యవసాయానికి సంబంధించిన ఎరువులు, పోషకాలు, క్రిమిసంహారక మందుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి.
Also Read : Harshavardhan Rane: పెళ్ళైన హీరోయిన్స్ తోనే తెలుగు హీరో ఎఫైర్.. ఇప్పటికీ ముగ్గురు..?
నాణ్యమైన ఉత్పత్తుల వాడకంతోనే నాణ్యమైన దిగుబడులు.. నాసిరకం మందులు, ఎరువుల వాడకాన్ని కలిసికట్టుగా నిరోధించాలన్నారు. రైతులు వ్యాపారులను నమ్మి ఉత్పత్తులు కొంటారు .. అలాంటి రైతులను ఎవరూ మోసం చేయవద్దు .. ఈ విషయంలో ఉత్పత్తిదారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ఎరువులు, పురుగుమందులలో నాణ్యమైనవి గుర్తించేందుకు ప్రభుత్వపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలలో రైతులకు ఈ విషయంలో చైతన్యం చేసేందుకు వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు మంత్రి నిరంజన్ రెడ్డి.
Also Read : Bullet Baba Temple: బైక్ కి గుడి కట్టి పూజలు.. బారులు తీరిన జనం
రైతులకు ఇప్పుడు మేలైన విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ రసాయనాలు సులభంగా అందుబాటులో ఉన్నాయన్నారు. అండ్ తెలంగాణ ప్రభుత్వ సెక్రటరీ (వ్యవసాయ అండ్ సహకార శాఖ) ఏపీసీ ఎం.రఘునందన్ రావు, ఐఏఎస్ మాట్లాడుతూ.. ఆన్‌లైన్ లైసెన్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ని వ్యవసాయ శాఖ ప్రవేశపెట్టడం వల్ల ఇన్‌పుట్‌ల రంగంలో మరింత విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయన్నారు. తెలంగాణ ఇప్పుడు వేగంగా రైస్ బౌల్ అఫ్ ఇండియాగా అభివృద్ధి చెందుతోందన్నారు.