ఎక్కడైనా దేవునికి గుడి కట్టి పూజలు చేయడం మనకు తెలుసు.. అయితే, ఈ మధ్యకాలంలో తమకు కావాల్సిన వారికి గుర్తుగా కూడా గుళ్లను కట్టుకుంటున్నారు. రాజస్థాన్ రాష్ట్రంలో వీటన్నింటికి భిన్నంగా ఓ బైక్ కు గుడి కట్టి అక్కడి ప్రజలు పూజలు చేస్తున్నారు. ఇంతకీ ఆ బైక్ కి ఎందుకు గుడి కట్టారో మీకు తెలుసా.. అయితే, 1980 సంవత్సరంలో ఓం సింగ్ రాథోడ్ అనే వ్యక్తి తనకు ఇష్టమైన రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ బైక్ మీద జర్నీ చేస్తుండగా ఒక చెట్టుకు ఢీ కొట్టి ఆ ప్రమాదంలో అతడు ప్రాణాలు కోల్పోయాడు.
Read Also: Kishan Reddy : ఇంటింటికీ వెళ్లి బీఆర్ఎస్ వైఫల్యాలను వివరించాలి
ఈ సంఘటన పాలీ జిల్లాలోని చోటిలా గ్రామ సమీపంలో జరిగింది. యాక్సిడెంట్ జరిగిన తర్వాత పోలీసులు ఆ బైకుని పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లారు. అయితే ఆశ్చర్యకరంగా ఆ బుల్లెట్ బైక్ తెల్లరేసరికి ప్రమాదం జరిగిన చోటు దగ్గర ఉన్నట్లు తెలిసింది. ఇది ఎవరో ఆకతాయిల తీసుకెళ్లి అక్కడ వదిలేసినట్లు పోలీసులు అనుకుని.. మళ్లీ దాన్ని అక్కడ నుంచి తీసుకుపోయి.. పోలీస్ స్టేషన్ లో పెట్టుకోగా.. మళ్లీ మునుపటి మాదిరిగానే ప్రమాదం జరిగిన ప్రాంతానికీ చేరింది. ఈ సంఘటన మొదట్లో అందరిని భయానికి గురిచేసిన.. ఆ తరువాత ఇందులో ఏదో దైవత్వం ఉందని గ్రహించిన స్థానికులు ఓం సింగ్ రాథోడ్‌కు నివాళులర్పించారు.
Read Also: Sunil Gavaskar: అశ్విన్ ‘కోలిగ్స్’ కామెంట్లపై సునీల్ గవాస్కర్ రియాక్షన్
ఓం సింగ్ రాథోడ్ ఆత్మ బుల్లెట్ బైకు మీద తిరుగుతుందని స్థానికులు అనుకున్నారు.. దీంతో ప్రమాదం జరిగిన స్థలాంలోనే గుడి కట్టారు. ఆ ప్రదేశంలో బుల్లెట్ బైకుకి పూజలు చేయడం స్టార్ట్ చేశారు. బుల్లెట్ బైక్ కు ఓం సింగ్ రాథోడ్ గౌరవార్థం ‘బుల్లెట్ బాబా’ అని నామాకరణం చేశారు. ప్రతి రోజూ ఎంతో మంది భక్తులు ఈ గుడిని దర్శించి ప్రార్థనలు చేస్తుంటారు.
Read Also: Pawan Kalyan: ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ వేగం చూస్తుంటే.. మెంటలెక్కిపోతుందే
ఈ బుల్లెట్ బాబా ఆలయంలో అగరవత్తులు వెలిగించడం, బుల్లుట్ బైక్ చుట్టూ ప్రదక్షిణలు చేయడం, మందు పోయటం లాంటి ఆచారాలు పాటిస్తారు. ఈ విధంగా చేస్తే భక్తులకు జర్నీ టైంలో ఎలాంటి ప్రమాదాలు జరగవని అక్కడ ఘాడంగా నమ్ముతారు. ఈ గుడికి కేవలం భారత్ లోనే కాకుండా ప్రపంచ నలుమూలల నుంచి కూడా భక్తులు, సందర్శకులు వస్తుంటారు అని స్థానికులు తెలిపారు. కొంతమంది ద్విచక్ర వాహనాదారులు, సాహస యాత్రికులు, ఆధ్యాత్మిక ఔత్సాహికులు తమ ప్రయాణంలో భాగంగా ఈ గుడిని సందర్శిస్తుంటారు.