First Trangender Railway Ticket Inspector: దక్షిణ భారతదేశంలో తొలిసారిగా రైల్వే టిక్కెట్ ఇన్‌స్పెక్టర్‌గా తమిళనాడుకు చెందిన సింధు అనే ట్రాన్స్‌జెండర్ నియమితులయ్యారు. ట్రాన్స్‌జెండర్ సింధు నాగర్‌కోవిల్‌కు చెందిన వారు. ఈమె తమిళ సాహిత్యంలో బి.లిటరేచర్ చేశారు. ఇది తన జీవితంలో మరచిపోలేని జ్ఞాపకమని సింధు అన్నారు. హిజ్రా కావడంతో ఏమీ చేయలేమన్న నిరుత్సాహం నుంచి ఈ స్థాయికి చేరుకున్నందుకు చాలా గర్వంగా ఉందన్నారు. హిజ్రాలు తమ సమస్యలతో కుంగిపోకుండా.. విద్య, శ్రమతో ఉన్నత స్థాయికి చేరుకోవాలని…
Actress Sindhu Passes Away Due To Unable to afford Breast Cancer Treatment: ఆస్పత్రి ఖర్చులకు డబ్బులేక నటి సింధు ప్రాణాలు కోల్పోయారు. బ్రెస్ట్ క్యాన్సర్ (రొమ్ము క్యాన్సర్)తో కొన్నాళ్లుగా బాధపడుతున్న 44 ఏళ్ల సింధు.. ఈరోజు (ఆగష్టు 7) వేకువజామున తమిళనాడు కిలిపక్కంలోని ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆసుపత్రి ఖర్చులను భరించలేక ఆమె కొంతకాలం ఇంట్లోనే చికిత్స తీసుకున్నారు. సింధు మరణం పట్ల తోటీ నటీనటులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 2020లో సింధు రొమ్ము…
కెనడా ఓపెన్ సూపర్-500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో కామన్వెల్త్ గేమ్స్ ఛాంపియన్ లక్ష్య సేన్ ఫైనల్ కు చేరుకున్నాడు. జపాన్‌కు చెందిన కెంటా నిషిమోటోపై వరుస గేమ్‌లతో విజయం సాధించి ఈ ఘనత సాధించాడు. మరోవైపు ప్రపంచ నం.1 క్రీడాకారిణి అకానె యమగుచి సెమీఫైనల్లో పీవీ సింధును ఓడించింది. మహిళల సింగిల్స్ సెమీ-ఫైనల్స్‌లో జపాన్ నంబర్ వన్ అకానె యమగుచి చేతిలో 14-21, 15-21 తేడాతో రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు ఓడిపోయింది.
పంజాబ్‌లో మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కొత్త పార్టీని ప్రకటించారు. పంజాబ్ లోక్ కాంగ్రెస్ పేరుతో పార్టీని ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గద్దె దించడమే లక్ష్యంగా పార్టీని నడిపించబోతున్నట్టు కెప్టెన్ తెలిపిన సంగతి తెలిసిందే. అంతేకాదు, 7 పేజీలతో కూడిన తన రాజీనామా లేఖను కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాకు పంపారు. మరి కొన్ని నెలల్లో పంజాబ్‌లో ఎన్నికలు జరగబోతున్న తరుణంలో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి కొత్తపార్టీని ఏర్పాటు చేసిన అమరీందర్ సింగ్…