Indrakaran Reddy: ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని నిర్మల్ జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన వేడుకల్లో అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. ఆదివాసీ ఆత్మగౌరవ పోరాట యోధుడు కుమ్రం భీం, గోండు వీరుడు రాంజీ గోండు విగ్రహాలకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆదివాసీల హక్కులు, సంస్కతి సాంప్రదాయాలకు పరిరక్షణ స్వయం పాలనకు ఎందరో మహానీయులు త్యాగాలు చేశారన్నారు. వారి పోరాటాలకు గుర్తుగా ప్రపంచ ఆదివాసి దినోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు. ఉమ్మడి పాలనలో గిరిజన గ్రామాలకు విద్యుత్ సదుపాయం లేక చీకటిలో మగ్గుతూ నివసిం చడానికి స్థలాలు, పక్కా గృహాలు లేక పూరిగుడిసెల్లో, పౌష్టికాహారం లేక, చదువుకు, సంపదకు ఆహారానికి, ఆరోగ్యానికి నోచుకోలేక జీవనం కొనసాగించే వారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఆదివాసీ, గిరిజనుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని చెప్పారు.
Read also: దాంపత్య సమస్యలను దూరం చేసే జాజికాయ
వారి కోసం ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల ఎకరాలకు 1.52 లక్షల మంది అడవి బిడ్డల కోసం పోటు పట్టాలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో లక్ష ఎకరాల భూమిని 37 వేల కుటుంబాలకు అందజేస్తున్నామని చెప్పారు. ఆదివాసీల గూడేలు, గిరిజన తండాలను జీపీలుగా ఏర్పాటు చేసి. మావ నాటే మావ రాజ్.. మా తాండాలో మా రాజ్యం అనే ఆదివాసీ గిరిజనుల ఆకాంక్షలను సీయం కేసీఆర్ నెరవేర్చారన్నారు. విద్యా, ఉద్యోగ రంగాల్లో ఎస్టీ రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచిన ఘనత సీయం కేసీఆర్ కే దక్కిందన్నారు. గిరిజన గూడాలకు, తాండాలకు విద్యుత్తు, రోడ్లు వంటి మౌలిక వసతులను మెరుగుపరిచామని పేర్కొన్నారు. ఆదివాసీ, గిరిజన ఆత్మగౌరవ భవనాలను నిర్మిస్తున్నామని, నిర్మల్ లో బంజారా భవన్ నిర్మాణానికి రూ. 2 కోట్లు కేటాయించామని తెలిపారు.
Rahul Gandhi: మణిపూర్ అల్లర్లపై ప్రధాని మోడీ టార్గెట్‌గా రాహుల్ గాంధీ విమర్శలు