భారత్ జోడో యాత్రతో నాలోని అహంకారం మొత్తం అణచివేసిందని రాహుల్ గాంధీ చెప్పారు. మోడీ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. అవిశ్వాసంపై లోక్ సభలో జరిగిన చర్చలో రాహుల్ హాజరైయ్యారు. గతంలో అదానీ గురించి మాట్లాడినప్పుడు ఓ పెద్దనేతకు ఇబ్బంది కలిగిందేమోనంటూ ప్రధానిపై రాహుల్ గాంధీ పరోక్షంగా సెటైర్లు వేశారు. అదానీ గురించి ఇవాళ నేను మాట్లాడను.. మీరు భయపడాల్సిన పనిలేదన్నారు. తనది రాజకీయ ప్రసంగం కాదు అని తెలిపారు.
Read Also: Hrithik Roshan : ఆ సమయంలో నన్నుచూసి ఎగతాళి చేసారు..
కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసిన విషయాన్ని రాహుల్ గాంధీ పార్లమెంట్ లో తెలిపారు. భారత్ జోడో యాత్ర ఇంకా ముగియలేదన్నారు. లడ్డాఖ్ వరకు తాను యాత్ర చేస్తానని ఆయన ప్రకటించారు. జోడో యాత్రలో అనేక అంశాలను తాను నేర్చుకున్నట్టుగా రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు. ప్రజల కష్టాలను దగ్గరుండి చూసినట్టుగా ఆయన వెల్లడించారు. లక్షల మంది తనతో కలిసి రావడంతో తనకు ధైర్యమొచ్చిందని తెలిపారు. పాదయాత్ర చేసే టైంలో తనలో కొద్ది కొద్దిగా అహంకారం మాయమైందన్నారు. పాదయాత్రలో తాను అనేక విషయాలను నేర్చుకున్నట్టుగా రాహుల్ గాంధీ పేర్కొన్నాడు.
Read Also: Rahul Gandhi: మణిపూర్ అల్లర్లపై ప్రధాని మోడీ టార్గెట్‌గా రాహుల్ గాంధీ విమర్శలు
2022 సెప్టెంబర్ 7న తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి నుంచి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను ప్రారంభించి.. 12 రాష్ట్రాల మీదుగా 3,970 కిలోమీటర్లు కొనసాగింది. ఈ సంవత్సరం జనవరి 30వ తేదిన జమ్మూ కశ్మీర్ లోని శ్రీనగర్ లో పాదయాత్ర ముగిసింది. దాదాపు 130 రోజుల పాటు ఈ పాదయాత్ర సాగింది. భారత్ జోడో యాత్ర రెండో విడత గుజరాత్ నుంచి ప్రారంభించనున్నట్లు పార్లమెంట్ వేదికగా రాహుల్ గాంధీ ప్రకటించారు. గుజరాత్ నుంచి మేఘాలయ వరకు పాదయాత్ర చేసేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తుంది.