ఏపీలో మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారంలో దూసుకెళ్లేందుకు సన్నద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 4న జనసేన ఎన్నికల శంఖారావం పూరించనుంది. అందుకోసం అనకాపల్లిలో జనసేన భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు. నూకాలమ్మ తల్లి అమ్మవారి దీవెనలతో ఎన్నికల శంఖారావం పూరించనున్నారు జనసేనాని.