Meerpet Murder Case: మీర్పేట్ న్యూ వెంకటేశ్వర నగర్‌లో జరిగిన హత్యకేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. వివాహేతర సంబంధానికి అడ్డుగా వస్తుందని భావించిన భర్త గురుమూర్తి, తన భార్య మాధవిని హత్య చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. మాధవిని హత్య చేసిన గురుమూర్తి, ఆమె మృతదేహాన్ని ఇంట్లోని బాత్రూమ్‌లో కత్తితో ముక్కలుగా చేసినట్లు పోలీసులు తెలిపారు. రక్తపు మరకలు కనిపించకుండా బాత్రూమ్‌ను పది సార్లు కడిగినట్లు కూడా పోలీసుల విచారణలో వెల్లడైంది. కేసు దర్యాప్తులో…
రంగారెడ్డి జిల్లా మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టీచర్స్ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. ది బాబ్ హెయిర్ అండ్ బ్యూటీ ఫ్యామిలీ సెలూన్ లో శానిటైజర్ తాగి యువతి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు దివ్య నల్లగొండ జిల్లా దేవరకొండకు చెందినదిగా పోలీసులు గుర్తించారు.
ఓ యువకుడు వివాహం కావడం లేదని ఆత్మహత్య చేసుకున్నాడు. నిన్న రాత్రి ఇంట్లో తండ్రితో గొడవపడి జిల్లెలగూడ సందన చెరువులో దూకి సూసైడ్ చేసుకున్నాడు యువకుడు. మృతుడు నాగరాజు (28) చంపాపేట్ నివాసిగా గుర్తించారు. యువకుడు న్యాయవాది దగ్గర పని చేసేవాడని బంధువులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కి తరలించారు.
మంత్రి సబితా ఇంద్రారెడ్డికి తన సొంత నియోజకవర్గం మహేశ్వరంలో వరుస తలనొప్పులు తప్పడంలేదు.. తాజాగా, టీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు
అవన్నీ హైదరాబాద్ శివారు మున్సిపాలిటీలు.. మున్సిపల్ కార్పొరేషన్. ప్రజాప్రతినిధులు అక్కడ పగ్గాలు చేపట్టిన ఏడాదికే గిల్లికజ్జాలు. వ్యూహం లోపిస్తుందో.. లేక ఒకరిపై ఒకరు పైచెయ్యి సాధించాలనే పట్టుదలో కానీ నిత్యం గొడవలే. శ్రుతి మించి రోడ్డుకెక్కుతున్నారు. మీర్‌పేట్‌లో మేయర్ భర్తదే పెత్తనం.. సెటిల్మెంట్లు! రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఏడాదిగా చర్చల్లో ఉంటోంది. ఇప్పుడు మేయర్ దీప భర్త దీప్లాల్ తీరుతో ఇంకోసారి అక్కడి యవ్వారాలు హాట్ టాపిక్‌గా మారాయి. మీర్‌పేట్‌లో దీప…