KL Rahul scripts history in SA vs IND 1st ODI: టీమిండియా తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ అరుదైన ఘనత సాధించాడు. పింక్ వన్డే గెలిచిన తొలి భారత కెప్టెన్‌గా రాహుల్ రికార్డుల్లోకెక్కాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా జోహన్నస్‌బర్గ్ వేదికగా ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి వన్డేలో భారత్ ఘన విజయం సాధించడంతో రాహుల్ పేరిట ఈ రికార్డు నమోదైంది. గతంలో ఏ భారత కెప్టెన్ దక్షిణాఫ్రికాతో పింక్ వన్డే గెలవలేదు. ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు పింక్ వన్డేలో గెలవలేదు.
రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన, ఫండ్ రైజింగ్ కోసం దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు (సీఏ) ప్రతి ఏటా ఓ వన్డే మ్యాచ్‌ను పింక్ కలర్ జెర్సీల్లో ఆడుతుంది. ఈ మ్యాచ్ సందర్భంగా ఆటగాళ్లతో పాటు ఫాన్స్ కూడా పింక్ కలర్ జెర్సీలు ధరిస్తారు. దక్షిణాఫ్రికా ఆటగాళ్లు పింక్ కలర్ జెర్సీలు ధరించి ఆడే మ్యాచ్‌ను ‘పింక్‌డే వన్డే’ అని అంటారు. ఈ మ్యాచ్ ద్వారా వచ్చే మొత్తంలో కొంత భాగాన్ని రొమ్ము క్యాన్సర్ బాధితుల కోసం దక్షిణాఫ్రికా క్రికెట్ ఖర్చు చేస్తుంది.
Also Read: KL Rahul: అనుకున్న దానికి పూర్తి భిన్నంగా జరిగింది.. చాలా సంతోషంగా ఉన్నా: రాహుల్
2013లో తొలిసారి పింక్ వన్డే జరిగింది. ఆ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను 34 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా ఓడించింది. 2013 నుంచి ఇప్పటి వరకు 12 పింక్ వన్డేలు జరిగాయి. ఇందులో దక్షిణాఫ్రికా 9 మ్యాచ్‌ల్లో గెలవగా.. 3 మ్యాచ్‌ల్లో ఓడింది. పింక్ వన్డేల్లో పాకిస్తాన్ (2019), ఇంగ్లండ్ (2020) మరియు భారత్ (2023) మాత్రమే ప్రొటీస్ జట్టును ఓడించాయి. గణాంకాలు చూస్తే.. పింక్ వన్డే దక్షిణాఫ్రికాకు బాగా కలిసొస్తుందని చెప్పాలి. ఇక 2015లో వెస్టిండీస్‌తో జరిగిన పింక్ వన్డేలో ప్రొటీస్ మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. ఏబీ 31 బంతుల్లో శతకం బాదాడు.