పూణేలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆల్ ఇండియా కోఆర్డినేషన్ మీటింగ్ 2023 జరుగుతోంది. ఈ సమావేశానికి 36 సంస్థలకు చెందిన 266 మంది ముఖ్య అధికారులు హాజరవుతున్నారు. ఈ సమావేశంలో పర్యావరణ అనుకూల జీవనశైలి, జీవన విలువలతో కూడిన కుటుంబ వ్యవస్థ, సామరస్యానికి పట్టుబట్టడం, స్వదేశీ ప్రవర్తన, పౌర విధులను నెరవేర్చడం వంటి ఐదు అంశాలపై చర్చించనున్నారు. ఈ సమాచారాన్ని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆల్ ఇండియా పబ్లిసిటీ చీఫ్ సునీల్ అంబేద్కర్ తెలిపారు. ఆర్ఎస్ఎస్ దేశానికి సేవ చేయడంలో సంఘ్ వాలంటీర్లు నిమగ్నమై ఉన్నారని.. సామాజిక జీవితంలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని పేర్కొన్నారు. ఈ పనులన్నీ దేశ సేవ, అభివృద్ధి కోసమేనని ఆయన అన్నారు.
MP Sanjay Singh: ‘ఒకవైపు అమరవీరుల అంతిమయాత్ర, మరోవైపు జీ20 సంబరాలు’ బీజేపీపై ఫైర్
ఆర్‌ఎస్‌ఎస్ సమావేశం ఏడాదికి ఒకసారి జరుగుతుందని సునీల్ అంబేద్కర్ చెప్పారు. అందులో తమ పని, అనుభవాలను పంచుకుంటారని తెలిపారు. ఆర్‌ఎస్‌ఎస్‌తో చాలా సంస్థలు కలిసి పనిచేస్తాయని.. ఈ సమావేశంలో అనేక రకాల సమిష్టి పని గురించి చర్చిస్తారని పేర్కొన్నారు. అంతేకాకుండా.. సమాజం ఎదుర్కొంటున్న సవాళ్లను ఎదుర్కోవడమే ఈ సమావేశం లక్ష్యమన్నారు. వాటిని సంకలనం చేయడం ద్వారా.. ఒక దిశను నిర్ణయించడం, జాతీయ స్ఫూర్తితో పని చేయడం ద్వారా పని వేగం పెరుగుతుందని తెలిపారు. దాదాపు అన్ని రంగాలలో పనిచేస్తున్న వివిధ సంస్థల ప్రతినిధులు సమావేశంలో పాల్గొంటారని సునీల్ అంబేద్కర్ చెప్పారు. ఈ సంస్థలన్నీ చాలా సంవత్సరాలుగా సామాజిక జీవితంలో చురుకుగా ఉన్నాయని.. వారి కృషితో వారు తమ తమ రంగాలలో ఒక ముఖ్యమైన స్థానాన్ని సృష్టించారని పేర్కొన్నారు.
Uttar Pradesh: కోడలిపై మామ అత్యాచారం.. విడిచిపెట్టిన భర్త..
ఈ సమావేశంలో దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలు జాతీయ పరిస్థితులు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై తమ అనుభవాలను పంచుకోనున్నారు. దీనికి సంబంధించిన అనేక అంశాలపై, సంస్థ యొక్క భవిష్యత్తు దిశ గురించి ప్రాథమిక ఆలోచన ఉంటుందని చెప్పారు. వారు తమ తమ రంగాలలో ఏమి అనుకున్నారో వారి ప్రణాళికలను కూడా పంచుకుంటారని సునీల్ పేర్కొన్నారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆర్‌ఎస్‌ఎస్ శాఖలతోపాటు విద్యాభారతి, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, సక్షం, వనవాసి కళ్యాణ్ ఆశ్రమం, సేవాభారతి, విశ్వహిందూ పరిషత్‌తోపాటు సర్‌సంఘచాలక్ డాక్టర్ మోహన్‌జీ భగవత్, సర్కార్యవహ్ దత్తాత్రేయ జీ హోసబాలే, సహ సర్కార్యవాహులు సేవికా సమితి, భారతీయ జనతా పార్టీ, భారతీయ మజ్దూర్ సంఘ్, భారతీయ కిసాన్ సంఘ్ మరియు ఇతర అనుబంధ సంస్థల ప్రతినిధులు సమావేశంలో పాల్గొంటారని తెలిపారు.