Telangana Congress: హైదరాబాద్‌లో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ముఖ్యంగా, స్థానిక సంస్థల ఎన్నికలు, ఎస్సీ వర్గీకరణ, కులగణన సర్వే, రాష్ట్ర బడ్జెట్‌పై చర్చించనున్నట్లు సమాచారం. రాజకీయ పరిస్థితులు, పార్టీ భవిష్యత్ వ్యూహాలపై కూడా ఈ భేటీలో చర్చ జరగనుంది. ఈ సమావేశం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ప్రారంభమవుతుంది. ముందుగా పార్టీ ఎమ్మెల్యేలతో…
ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్‌గా బోకారోలో ముఖ్య కార్యకర్తల సమన్వయ సమావేశానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హాజరయ్యారు. సమావేశానికి ముందుగా ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆమెకు నివాళి అర్పించి.. అసెంబ్లీ ఎన్నికలలో అభ్యర్థుల గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలను కార్యకర్తలకు దిశానిర్ధేశం చేసారు.
ఉమ్మడి జిల్లాల వారీగా రేపట్నుంచి టీడీపీ - జనసేన సమన్వయ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 29, 30, 31వ తేదీల్లో సమన్వయ సమావేశాలు కొనసాగనున్నాయి. జిల్లాల్లో జరిగే సమన్వయ సమావేశాలకు పర్యవేక్షణ నిమిత్తం రెండు పార్టీల నుంచి ఒక్కొక్కరు చొప్పున సీనియర్ నేతలు హాజరు కానున్నారు.
పూణేలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆల్ ఇండియా కోఆర్డినేషన్ మీటింగ్ 2023 జరుగుతోంది. ఈ సమావేశానికి 36 సంస్థలకు చెందిన 266 మంది ముఖ్య అధికారులు హాజరవుతున్నారు. ఈ సమావేశంలో పర్యావరణ అనుకూల జీవనశైలి, జీవన విలువలతో కూడిన కుటుంబ వ్యవస్థ, సామరస్యానికి పట్టుబట్టడం, స్వదేశీ ప్రవర్తన, పౌర విధులను నెరవేర్చడం వంటి ఐదు అంశాలపై చర్చించనున్నారు.