ఆలస్యంగా గవర్నర్ ఆర్టీసీ బిల్లును ఆమోదించారు అని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆర్టీసీనీ గత ప్రభుత్వాలు ప్రయివేట్ పరం చెయ్యాలని చూసిన కేసీఆర్ కాపాడాలని చూశారు అని ఆయన అన్నారు. గవర్నర్ అడ్డంకులు సృష్టించాలని చూసినప్పటికీ ధర్మం గెలిచింది.. ఆర్టీసీ కార్మికులు ఇక నుంచి కార్మికులు కారు.. ఆర్టీసీ కార్మికుల జీవితాల్లో మరపు రాని దినం అని మంత్రి పేర్కొన్నారు.
Read Also: MP Sanjay Singh: ‘ఒకవైపు అమరవీరుల అంతిమయాత్ర, మరోవైపు జీ20 సంబరాలు’ బీజేపీపై ఫైర్
కాంగ్రెస్, బీజేపీ నాయకులు పాలమూరుపై విమర్శలు చేస్తున్నారు అని మంత్రి హరీశ్ రావు అన్నారు. కాంగ్రెస్ హయంలో పాలమూరు ప్రాజెక్ట్ అంటేనే పెండింగ్ ప్రాజెక్ట్ లుగా పేరు పడింది.. పెండింగ్ ప్రాజెక్ట్ లన్నింటిని మన సీఎం కేసీఆర్ పూర్తి చేస్తున్నారు.. ప్రపంచంలో అతి పెద్ద ప్రాజెక్ట్ అంటూ ఆయన తెలిపారు. ప్రతి పక్షాలు శకుని మాటలు మాట్లాడుతున్నాయన్నారు. పాలమూరు ప్రజలు పండుగ మాదిరిగా భావిస్తుంటే అది దండుగ అని కాంగ్రెస్ అంటుంది అని మంత్రి హరీశ్ రావు చెప్పారు. కాంగ్రెస్ ను ప్రజలు దండుగ అనే పరిస్థితి వుంది.. ప్రతిపక్షాలు ప్రజలకు పగొల్ల మాదిరిగా తయారు అయ్యారు అని చెప్పుకొచ్చారు.
Read Also: Neha Shetty:నడుము అందాలతో కుర్రకారుల గుండెల్లో సెగలు పుట్టిస్తున్న నేహా శెట్టి
భూసేకరణ, గ్రీన్ ట్రిబ్యునల్ ఇవన్నీ పగోల్ల మాదిరిగా చేయడం కాదా అని మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. కేసీఆర్ పనిమంతుడు.. పనోల్లు కావాలా పగొల్లు కావాలా మీరే తేల్చుకోండి.. నీళ్ళు రాకుండా చేసి ఓట్ల రాజకీయం చేస్తున్నారు అని ఆయన తెలిపారు. కాంగ్రెస్ అసత్య ప్రచారం చేయడం అబద్ధాలు చెప్పి గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలు నోబుల్స్ కోరుకుంటారు.. కాంగ్రెస్ కు జన బలం లేదు ప్రజలు బీఆర్ఎస్ పక్షాన ఉన్నారు.. వచ్చే ఎన్నికల్లో నోబుల్స్ కు గోబెల్స్ కు మధ్య పోటీ.. నోబుల్స్ ను ప్రజలు గెలిపిస్తారని మంత్రి హరీశ్ రావు చెప్పారు.
Read Also: Uttar Pradesh: కోడలిపై మామ అత్యాచారం.. విడిచిపెట్టిన భర్త..
రేపు 12 గంటలకు మెడికల్ హాస్పటల్లు సీఎం కేసీఆర్ ప్రారంభం చేస్తారు అని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఇండియాలో అతి తక్కువ ఫీజు, ఎక్కువ స్కాలర్ షిప్ ఇచ్చేది కూడా తెలంగాణ.. ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్-1, డాక్టర్ల ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్-1 ఐటీ ఉత్పత్తిలో ఉద్యోగాల కల్పనలో తెలంగాణ రాష్ట్రం నెంబర్-1 అన్నారు. తన్నుల సంస్కృతి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీది టన్నుల ధాన్యం సంస్కృతి అని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ హయంలో ఏది కావాలన్న తన్నులే.. మేము అధికారంలోకి వస్తం అనేది కాంగ్రెస్ పార్టీది మేకపోతు గాంభీర్యం మాత్రమేనని మంత్రి చెప్పారు. కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వస్తె కుర్చీల కొట్లాట పదవుల కోసం కొట్లాట మత కల్లోలాలు సృష్టించి పదవులు కోసం పోటీలు పడతారు అంటూ హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.